Begin typing your search above and press return to search.

‘బాహుబలి’కి మాత్రమే ఈ బంపరాఫర్

By:  Tupaki Desk   |   12 March 2017 7:40 AM GMT
‘బాహుబలి’కి మాత్రమే ఈ బంపరాఫర్
X
టీవీ ఛానెల్లో ఒక యాడ్ వేయాలంటే నిర్మాత డబ్బులివ్వాల్సిందే. ఫ్రీగా ఎవ్వరికీ యాడ్ స్పేస్ ఇవ్వరు. అందులోనూ ‘బాహుబలి’ లాంటి మెగా సినిమాకు ఆడియో వేడుక జరుగుతున్నపుడు యాడ్ స్పేస్ ఖరీదు చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఈ ఆడియో వేడుకలో యాడ్ స్పేస్‌ ను ఉచితంగా ఇచ్చేస్తున్నారు. ఆ బంపర్ ఆఫర్ అందుకున్నది మరెవరో కాదు.. ‘బాహుబలి’ నిర్మాతలే. అవును.. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఆడియో వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయబోయే టీవీ ఛానెళ్లు కొంత యాడ్ స్పేస్ ను ‘బాహుబలి’ నిర్మాతలకే ఫ్రీగా ఇచ్చేశారు. దీంతో పాటుగా అర కోటి రూపాయలు ఆడియో వేడుక ప్రసార హక్కుల కోసం ముట్టజెప్పడం విశేషం.

‘బాహుబలి: ది కంక్లూజన్’ ఆడియో వేడుక ఈ నెల 26న రామోజీ ఫిలిం సిటీలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుక ప్రసార హక్కుల్ని కొన్ని టీవీ ఛానెళ్లకు కలిపి అర కోటి కంటే కొంచెం ఎక్కువ మొత్తానికే అమ్మారు. దీంతో పాటుగా కొంత యాడ్ స్పేస్ కూడా ఉచితంగా ఇచ్చారు. ఆ స్పేస్ ను బాహుబలి నిర్మాతలు ఎవరికైనా అమ్ముకోవచ్చు. లేదా వాళ్లే వాడుకోవచ్చు. ముందుగా విశాఖపట్నంలో చేయాలనుకున్న ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఆడియో వేడుకను.. రామోజీ ఫిలిం సిటీకి మారుస్తున్న సంగతి తెలిసిందే. అక్కడే మహిష్మతి రాజ్య సెట్టింగ్ లో ఆడియో వేడుకను అంగరంగ వైభవంగా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంతకంటే ముందు ఈ నెల 16న ‘ది కంక్లూజన్’ ట్రైలర్ విడుదలవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/