Begin typing your search above and press return to search.

టీవీ యాంక‌ర్‌ న్యూ హాట్ లుక్‌

By:  Tupaki Desk   |   2 Jan 2019 7:23 AM GMT
టీవీ యాంక‌ర్‌ న్యూ హాట్ లుక్‌
X
నియా శ‌ర్మ సౌత్ కి అంత‌గా ప‌రిచ‌యం లేక‌పోయినా, ఉత్త‌రాది వారికి బాగా సుప‌రిచిత‌మైన హాట్ గాళ్. ఈ బ్యూటీ టాప్ మోడ‌ల్ గా, టీవీ న‌టిగా, యాంక‌ర్ గా పాపుల‌ర్. నియా `తెనాలి రామ‌` షో ఇప్ప‌టికీ యూట్యూబ్‌ లో పాపుల‌ర్‌. `ఏక్ హ‌జారోన్ మే మెరిట్ బెహ‌నా హై` టీవీ షోతోనూ బాగా పాపుల‌రైంది. ఆసియాస్ సెక్సీయెస్ట్ గాళ్ - 2018 గా ఎంపికైన త‌ర్వాత ప్ర‌పంచం మొత్తం పాపుల‌రైంది. ఆ త‌ర్వాత నియా శ‌ర్మ సామాజిక మాధ్య‌మాల్లో నిరంత‌రం లేటెస్ట్‌ ఫోటోషూట్లు షేర్ చేస్తూ వేడి పెంచుతూనే ఉంది.

తాజాగా నియాశ‌ర్మ వేడెక్కించే బ్లాక్ బికినీ లుక్ ని ఇన్‌ స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు యువ‌త‌రంలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. హిందీ టీవీ షోల‌తో వ‌చ్చిన పాపులారిటీని ఈ బ్యూటీ క్యాష్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ట‌. నియా బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ ముగిశాక పూర్తిగా సినిమా ఛాన్సుల పైనా దృష్టి సారించ‌నుంద‌ని తెలుస్తోంది.

తొలుత బుల్లితెర‌ పై పాపుల‌రై, అటుపై పెద్ద తెర‌పైనా వేడెక్కిస్తున్న క‌థానాయిక‌ల‌కు కొద‌వేం లేదు. ఆ కోవ‌లో ఇప్ప‌టికే హేట్ స్టోరి బ్యూటీ ఊర్వ‌శి రౌతేలా, గోల్డ్ ఫేం మౌనిరాయ్ ఏ స్థాయిలో దూసుకుపోతున్నారో తెలిసిందే. ఈ భామ‌లు అటు బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ అవ‌కాశాల కోసం గాలం వేస్తున్నారు. నియా శ‌ర్మ‌ గ్రాఫ్ కూడా అంత పెద్ద‌గా రాకెట్ స్పీడ్ తో దూసుకొస్తుందేమో చూడాలి.