Begin typing your search above and press return to search.

ఈ నటి కష్టాలు వింటే .. కన్నీళ్లు ఆగవు..!

By:  Tupaki Desk   |   17 May 2021 6:00 AM IST
ఈ నటి కష్టాలు వింటే .. కన్నీళ్లు ఆగవు..!
X
‘చేతిలో ఒక్కప్రాజెక్ట్ లేదు. పైగా ప్రాణాంతక వ్యాధి. నా పరిస్థితి ఎవరికీ రావొద్దు. ఈ లాక్ డౌన్​ నాకు కష్టాలనే మిగిల్చింది’ అంటూ ఓ టీవీ నటి తన కష్టాలను సోషల్​ మీడియా ద్వారా పంచుకున్నారు. ది కపిల్​ శర్మ షో ఫేం నటి సుమోనా చక్రవర్తి ఇటీవల సోషల్​ మీడియాలో తన కష్టాలను పంచుకున్నారు. లాక్​డౌన్​ తన జీవితంలో ఎంతటి కష్టాలను మోసుకొచ్చిందో ఆమె చెప్పుకొచ్చారు. ‘ నేను పదేళ్లుగా ఎండిమోట్రియోసిస్​ ( గర్భాశయ సంబంధిత వ్యాధి) తో బాధపడుతున్నాను. ప్రస్తుతం అది నాలుగో దశలో ఉంది.

లాక్​డౌన్​ తో మానసికంగా ఎంతో కుంగిపోయాను. సినిమా వాళ్ల జీవితం చాలా బాగుంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ మా జీవితంలో సైతం ఎన్నో కష్టాలు ఉంటాయి.

మా చుట్టూ ఉండే వాళ్లు కూడా మామూలు మనుషులే. ఈర్షా, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు మా జీవితంలో కూడా ఉంటాయి. కానీ ప్రస్తుతం మనకు కావాల్సింది. ప్రేమ, జాలి, దయ, తోటివారికి సాయం చేసే గుణం. మానసిక, శారీరకరుగ్మత వచ్చినప్పుడు అందరికీ ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడిని జయించేందుకు తగిన వ్యాయామం చేయాలి. మంచి ఆహారపదార్థాలు తీసుకోవాలి’ అంటూ ఆమె అభిమానులకు సూచించారు.

‘అందరికీ వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. సినిమా వాళ్లు అయినంత మాత్రనా మా జీవితం పూలపాన్పు కాదు. ఈ విషయాన్ని అభిమానులతో షేర్​ చేసుకోవాలని నేను భావించాను. చాలా రోజులుగా నాకు ఉద్యోగం లేదు. అయినా నేను నా కుటుంబాన్ని పోషించుకున్నాను. నా మీద ఆధారపడి చాలా మంది ఉన్నారు. అలాగే అందరి జీవితంలోనూ ఇటువంటి కష్టాలు ఉంటాయి. వాళ్లు కుంగిపోకుండా ఒత్తిడిని జయించాలి’ అని ఆమె పేర్కొన్నారు.