Begin typing your search above and press return to search.

నటి శ్రావణి చావుకు వారిద్దరే కారణం.. అసలేం జరిగింది?

By:  Tupaki Desk   |   14 Sept 2020 2:21 PM IST
నటి శ్రావణి చావుకు వారిద్దరే కారణం.. అసలేం జరిగింది?
X
టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. శ్రావణి స్నేహితులైన దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణ రెడ్డిలను విచారించిన పోలీసులు ఆమె మృతికి గల కారణాలు తెలుసుకున్నట్టు సమాచారం.

దేవరాజ్, సాయికృష్ణ వేధింపులు భరించలేకనే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్టుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

మూడు రోజుల నుంచి దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణను పోలీసులు విచారిస్తున్నారు. శ్రావణి చనువుగా ఉండడం ఇష్టం లేకనే దేవరాజ్, సాయి గొడవ పడ్డారని అంటున్నారు.

సినిమాలపై వ్యామోహంతో శ్రావణి ఎనిమిదేళ్ల క్రితం కాకినాడ సమీపంలోని గొల్లప్రోలు నుంచి హైదరాబాద్ వచ్చింది. ఆమెకు ఫ్రెండ్ ద్వారా సాయికృష్ణ పరిచయమై సినిమాలు, సీరియల్స్ లో అవకాశం ఇప్పించాడు. ఆర్థికంగా ఆమె ఎదుగుదలలో దోహదపడ్డాడు.

ఆ తర్వాత టిక్ టాక్ ద్వారా దేవరాజ్ శ్రావణికి పరిచయం అయ్యాడు. చనువు పెంచుకున్నాడు. వీరిద్దరూ క్లోజ్ గా ఉండడం సాయికి నచ్చలేదు. పోలీస్ స్టేషన్ వరకు గొడవ వెళ్లడంతో దేవరాజ్ దూరంగా జరిగాడు. ఈనెల 7న దేవరాజ్ ను శ్రావణి రెస్టారెంట్ లో కలవడం.. సాయి వచ్చి గొడవ చేయడంతో వివాదం ముదిరింది.

ఈ క్రమంలోనే సాయి రెస్టారెంట్ లో శ్రావణిపై చేయిచేసుకున్నట్టు సమాచారం. దీంతోపాటు సాయి, ఫ్యామిలీ మెంబర్స్ వేధించారని.. దాడి చేశారని శ్రావణి పేర్కొందని దేవరాజ్ పోలీసులకు ఆడియో క్లిప్స్ అందజేశాడు.

దీంతో పోలీసులు శ్రావణి ఆత్మహత్యకు సాయి, దేవరాజ్ కారణమని నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. వారిని అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాతను విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.