Begin typing your search above and press return to search.

టీవీ న‌టి శ్రావ‌ణి కేసులో ఏమిటీ మ‌త‌ల‌బు?

By:  Tupaki Desk   |   11 Sept 2020 10:15 AM IST
టీవీ న‌టి శ్రావ‌ణి కేసులో ఏమిటీ మ‌త‌ల‌బు?
X
బుల్లితెర న‌టి శ్రావ‌ణి ఆత్మ హ‌త్య చుట్టూ నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడిగా భావిస్తున్న దేవ‌రాజ్ ఎట్ట‌కేల‌కు లొంగిపోయాడు. హైద‌రాబాద్ ఎస్సార్ న‌గ‌ర్ పోలీసుల ఎదుట లొంగిపోయిన‌ట్టు సీఐ న‌ర‌సింహారెడ్డి స్ప‌ష్టం చేశారు. పోలీసుల ఆదేశాల మేర‌కు కాకినాడ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన దేవ‌రాజ్ విచార‌ణ‌కు హాజ‌రు కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

ఈ సంద‌ర్భంగా అత‌ని స్టేట్ ‌మెంట్ ‌ని ఎస్సార్ న‌గ‌ర్ పోలీసులు రికార్డ్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే త‌న‌కు శ్రావ‌ణికి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌ల‌కు సంబంధించిన కాల్ రికార్డ్ డాటాను దేవ‌రాజ్ పోలీసుల‌కు స‌మ‌ర్పించార‌ట‌. ఈ కేసులో దేవ‌రాజ్ తో పాటు సాయికృష్ణారెడ్డి ని కూడా విచారిస్తున్న‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు. నిందితులు ఎవరి‌నీ విడిచిపెట్ట‌మని క‌చ్ఛి‌తంగా అరెస్ట్ చేస్తామ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు.

దేవ‌రాజ్ గ‌త కొంత రాలంగా శ్రావ‌ణిని వేధిస్తున్నాడ‌ని శ్రావ‌ణి కుటుంబ స‌భ్యులు ఇప్ప‌టికే పోలీసుల‌కు తెలియ‌జేయ‌డంతో దేవ‌రాజ్ ప్ర‌ధాన నిందితుడిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. అయితే దేవ‌రాజ్ మాత్రం సాయి కృష్ణారెడ్డే చిత్ర హింస‌ల‌కు పాల్ప‌డ్డాడ‌ని ఆరోపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.