Begin typing your search above and press return to search.

49 ఏళ్ల హీరోయిన్‌ న్యూడ్‌ క్లిప్స్‌

By:  Tupaki Desk   |   13 July 2015 11:38 PM IST
49 ఏళ్ల హీరోయిన్‌ న్యూడ్‌ క్లిప్స్‌
X
బాత్‌రూమ్‌ స్నానాల్ని వీడియోలు తీసి ఆన్‌లైన్‌లో పెట్టడం, డ్రెస్సింగ్‌ రూమ్‌ విన్యాసాల్ని సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేసి యూట్యూబ్‌లో పెట్టడం ఇలాంటి ఘటనల గురించి చాలాసార్లు విన్నాం. కన్నాం. త్రిష, ఇలియాన, హన్సిక ఒకరేమిటి ఎంతో మంది నాయికలు ఇలాంటివాటికి చిక్కి అల్లాడినవారే. ఒరిజినల్‌ వీడియోను ఫేక్‌ వీడియోనో తెలియనంతగా ఈ వీడియోలు సంచలనం సృష్టించాయి.

టెక్నాలజీ యుగంలో కొత్త ఇక్కట్లు ఇవి. వీడియో క్లిప్‌, ఎమ్మెమ్మెస్‌ క్లిప్‌.. అరాచకాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ముంబై. మోడలింగ్‌ పరిశ్రమ కళకళలాడే అలాంటిచోట ఒకటేమిటి రకరకాల అరాచకాలు నిత్యం సాగుతూనే ఉంటాయి. లేటెస్టుగా ఓ 49ఏళ్ల నటి ఇదే టైపులో బుక్కయ్యిందని పోలీస్‌ చెబుతున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా సదరు క్రిమినల్‌ని పట్టుకుని జైల్‌లో వేశారు. ఇంతకీ అతగాడు చేసిందేమిటంటే... సీక్రెట్‌ కెమెరాతో నగ్న వీడియోలు చిత్రీకరించడం. దానికోసం కెమెరా ఉపయోగించాడు. సెల్‌ఫోన్‌ ఉపయోగించాడు. దారి ఏదైనా మొత్తానికి బోలెడన్ని క్లిప్స్‌ సేకరించాడు. ఉన్నట్టుండి ఓ రోజు డ్రెస్సింగ్‌ రూమ్‌ పరిశీలించిన సదరు హీరోయిన్‌ అవాక్కయ్యింది. ఓ కార్నర్‌లో కెమెరా బిగించి ఉంది. అలాగే తను డ్రెస్సు మార్చుకునే టేబుల్‌ పరిసరాల్లో ఓ మొబైల్‌ రికార్డింగ్‌ మోడ్‌లో ఉంది. వెంటనే స్టాఫ్‌ని అలెర్ట్‌ చేసి సదరు వెదవాయి ఎవరో ఆరాతీసింది.

ఆ పని చేస్తోంది తన అసిస్టెంట్‌ అబ్ధుల్‌ ఖయ్యూమ్‌ అన్సారీ అని తెలసుకుంది. తర్వాత సెల్‌ఫోన్‌, కెమెరా రికార్డింగులన్నిటినీ పోలీసులు స్వాధీనపరుచుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఐపీసీ సెక్షన్‌ 345సి పేరిట మక్కెలిరగతన్ని జైల్లో వేశారు. కాని ఏం లాభం.. ఓ రోజులో బెయిల్‌ మీద కుర్రాడు బయటకు కూడా వచ్చేశాడు.