Begin typing your search above and press return to search.
నటి, నటుడి ఆత్మహత్య.. దుర్వాసనతో వెలుగులోకి..
By: Tupaki Desk | 9 Jun 2020 10:30 AM ISTకరోనా-లాక్ డౌన్ తో అందరి జీవితాలు తలకిందులయ్యాయి. లాక్ డౌన్ సందర్భంగా ఎలాంటి ఆదాయం లేక.. దాచుకున్న సొమ్ము మొత్తం ఖాళీ కావడంతో జీవితంపై విరక్తి చెందిన ఒక నటీ, నటుడు ఆత్మహత్య చేసుకున్న విషాధ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది.
కొద్దిరోజులుగా నటీ, నటుడు బయటకు రాకపోవడం.. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు వచ్చిచూస్తే నటీ, నటుడు సూసైడ్ చేసుకోవడం కనిపించింది. దీంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
చెన్నైలోని కోడుంగైయ్యార్ ముతామిజ్ నగర్ లో శ్రీధర్, ఆయన సోదరి జయ కల్యాణి నివసిస్తున్నారు. ఇద్దరూ తమిళ టీవీ సీరియల్స్ లో నటిస్తున్నారు. వీరి సిరియల్స్ హిట్ కావడంతో ఇద్దరికి మంచి పేరు వచ్చింది.
అయితే కరోనా వీరి కడుపుకొట్టింది. మార్చి 25వ తేదీ నుంచి లాక్ డౌన్ తో షూటింగ్ లు బంద్ కావడంతో వీరు ఇంటికే పరిమితమయ్యారు. ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేతిలో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ అయిపోవడంతో తట్టుకోలేకపోయారు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నారు.
లాక్ డౌన్ నిబంధనలతో షూటింగ్ లలో కూడా తక్కువమందితో చేయడం.. వీరికి పిలుపు రాక పోవడంతో జీవితం పై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. సినీ పరిశ్రమలో ఇలా వరుసగా నటీ నటుల చావులు పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి.