Begin typing your search above and press return to search.

బుల్లితెర నటికి 'కాంప్రమైజ్' అంటూ ఆఫర్

By:  Tupaki Desk   |   30 Nov 2017 5:42 PM IST
బుల్లితెర నటికి కాంప్రమైజ్ అంటూ ఆఫర్
X
క్యాస్టింగ్ కౌచ్ గురించి మాటలు గత కొంతకాలంగా ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నాయి. కొందరు తమ ఫీలింగ్ చెబుతుంటే.. మరికొందరు ప్రచారం కోసం వాడుకుంటున్నారు. మరికొందరు తమ అనుభవాలను చూచాయగా చెప్పుకుంటున్నారు. బుల్లితెర నటి సులజ్ఞా ఛటర్జీ రీసెంట్ గా ఇలాంటి సంఘటనకు చెందిన ఓ పోస్ట్ పెట్టింది.

ఇందులో 'కాంప్రమైజ్' కు సంబంధించిన టెక్ట్స్ ఉంటుంది. ఓ టాప్ డైరెక్టర్ తో కాంప్రమైజ్ అయితే.. ఓ స్టార్ నటుడితో చేసే అవకాశం లభిస్తుందన్నది దీని సారాంశం. అయితే.. ఇదేమీ తాను ప్రచారం చేసిన పోస్ట్ కాదని.. క్యాజువల్ గా చేసిన పోస్ట్ మాత్రమే అని సులజ్ఞా ఛటర్జీ అంటోంది. బాలీవుడ్ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ అనగానే ముందు చాలా సంతోషించానని.. ఈ షూట్ ఒక రోజు మాత్రమే ఉంటుందని చెప్పారన్న సులజ్ఞ.. టెస్ట్ షూట్ కు గురించి మధ్యవర్తి మాట్లాడతాడని భావించినట్లు తెలిపింది.

కానీ అతను కాంప్రమైజ్ గురించి మాట్లాడ్డంతో అక్కడితే బ్రేక్ పడిందని ఆమె చెప్పంది. అయితే.. ఇలాంటివన్నీ మధ్యవర్తుల మాటలు మాత్రమే అన్న సులజ్ఞ.. ఏ దర్శకుడు. నిర్మాత కూడా కాంప్రమైజ్ అయితే స్టార్ ని చేస్తా అనే మాటలను ఉపయోగించరని చెప్పడం విశేషం.