Begin typing your search above and press return to search.

తుపాకీ ట్రిబ్యూట్: దివికేగిన లెజెండరీ ఫిల్మ్ మేకర్!

By:  Tupaki Desk   |   30 April 2021 12:30 PM GMT
తుపాకీ ట్రిబ్యూట్: దివికేగిన లెజెండరీ ఫిల్మ్ మేకర్!
X
సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ - సినిమాటోగ్రాఫర్ కేవీ ఆనంద్.. ఇటీవలే కరోనా కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. కేవలం 54 సంవత్సరాల వయసులోనే కేవీ ఆనంద్ చనిపోవడంతో సౌత్ సినీ సెలబ్రిటీలు ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే ఇండియన్ సినీ ఇండస్ట్రీ కూడా మరో లెజెండ్ ను కోల్పోయిందని ఇండస్ట్రీలు వెల్లడిస్తున్నాయి. సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన కేవీ ఆనంద్.. జాతీయ పురస్కారం అందుకొని ఎన్నో గొప్ప సినిమాలను తెరమీదకు తీసుకొచ్చారు.

1966లో పుట్టిన కేవీ ఆనంద్.. 90వ దశకంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ దగ్గర అసిస్టెంట్ గా చేరాడు. కమల్ హాసన్ 'దేవర్ మగన్', మణిరత్నం 'తిరుడాతిరుడా' లాంటి సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసారు. కానీ ఈ ఫీల్డ్ లోకి రాకముందు ఆనంద్ ఫ్రీలాన్స్ ఫోటో జర్నలిస్ట్ గా పనిచేసారు. అనంతరం స్టార్ డైరెక్టర్ ప్రియదర్శిన్ ఓ కొత్త ప్రాజెక్ట్ గురించి పీసీ శ్రీరామ్ ను సంప్రదించినప్పుడు శ్రీరామ్ బిజీగా ఉన్నానని.. తన అసిస్టెంట్ కేవీ ఆనంద్ ను రెఫెర్ చేసాడట. అంతే అక్కడితో కేవీ ఆనంద్ కెరీర్ మలుపు తిరిగింది. 1996లో 'తెన్మావిన్ కొంబాత్' సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా డెబ్యూ అయ్యాడు. ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు అందుకున్నాడు కేవీ ఆనంద్.

ఆ తర్వాత మిన్నరం, పుణ్యభూమి నా దేశం, ప్రేమదేశం లాంటి సూపర్ హిట్ సినిమాలకు పనిచేసాక ఒకేఒక్కడు సినిమాతో డైరెక్టర్ శంకర్ తో జతకట్టాడు. వీరిద్దరూ కలిసి బాయ్స్, శివాజి వంటి బ్లాక్ బస్టర్స్ తీశారు. అనంతరం 2009లో వీడొక్కడే సినిమాతో దర్శకుడుగా మారారు ఆనంద్. ఆ సినిమా హీరో సూర్య కెరీర్లో బ్లాక్ బస్టర్. ఆ తర్వాత రంగం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఆనంద్. అలా ప్రతి సినిమాతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. అలా దర్శకుడుగా బ్రదర్స్, అనేకుడు, బందోబస్త్ సినిమాలు రూపొందించారు. అలా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా ఆయన పేరు నిలుపుకున్నారు.

లెజెండ్ కేవీ ఆనంద్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. మీ తుపాకీ మీడియా.