Begin typing your search above and press return to search.
ఇండస్ట్రీ హిట్: ఇప్పటికీ చిట్టి బాబుకే ఓటేస్తున్నారు!
By: Tupaki Desk | 29 Jan 2020 10:28 AM IST"నేను అమెరికా ప్రెసిడెంట్.. అమెరికా ప్రెసిడెంట్" అంటూ ఖైరతాబాద్ చౌరాస్తాలో నిలుచుని మనం ఉదయం నుంచి సాయంత్రం వరకూ గొంతు నెప్పి పుట్టేలా అదేపనిగా కేకలు పెట్టామనుకోండి.. డోనాల్డ్ ట్రంప్ అవుతామా? జనాలు మనల్ని అమెరికా అధ్యక్షుడు అనుకుంటారా? చచ్చినా నమ్మరు. పైగా పిచ్చోడనుకుని ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపుతారు. ఈ లాజిక్ ఫేక్ కలెక్షన్లకు.. సక్సెస్ మీట్లకు..ఇండస్ట్రీ హిట్లకు.. హీరోల కొట్లాటలకు వర్తిస్తుంది.
మాది హిట్ అన్ని చెప్పుకోవడం వరకూ సరే. ప్రేక్షకాదరణతో మంచి వసూళ్లు సాధించింది అని కూడా చెప్పుకోవచ్చు. జనాలు తప్పుగా ఏమీ అనుకోరు. మాది హిట్టు అని చెప్పుకోవడం మానేసి మాదే హిట్టు.. మేమే విన్నర్.. మేమే బ్లాక్ బస్టర్ కా బాప్.. మా సినిమానే ఇండస్ట్రీ హిట్.. మా సినిమానే ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అని ప్రచారం చేసుకుంటే జనాలు నమ్ముతారా? నిజానికి ఈ ప్రచారాన్ని అధికశాతం ప్రేక్షకులు అసలు నమ్మడం లేదు.
ఈమధ్య సరిగ్గా ఇండస్ట్రీ హిట్ టాపిక్ పైన తుపాకి ఒక పోల్ నిర్వహించింది. 'నిజమైన నాన్ బాహుబలి రికార్డు ఏ సినిమా పేరిట ఉంది?' అనేది ప్రశ్న. దీనికి 'రంగస్థలం'.. 'అల వైకుంఠపురములో'.. 'సరిలేరు నీకెవ్వరు' అంటూ మూడు ఆప్షన్లు ఇస్తే అధికశాతం పాఠకులు చరణ్ 'రంగస్థలం' సినిమాకు పట్టం కట్టడం విశేషం.
నిజమైన నాన్ బాహుబలి రికార్డు 'రంగస్థలం' సినిమా పేరిట ఉందని 69.90 శాతం రీడర్స్ ఓటు వేయగా 'అల వైకుంఠపురములో' సినిమాకు 17.43% 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి 12.67% ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి అల్లు అర్జున్.. మహేష్ బాబు టీమ్స్ ఎంత ఊదర గొట్టినా ఈ కలెక్షన్ల లెక్కలను.. ఇండస్ట్రీ హిట్ పోస్టర్ల ను ప్రేక్షకులు ఏమాత్రం నమ్మడం లేదని.. పట్టించుకోవడం లేదని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ గ్రౌండ్ రియాలిటీ పెద్దలకు అర్థం అవుతుందో లేదో!