Begin typing your search above and press return to search.

'తుపాకీ రాముడు' గా బిత్తిరి స‌త్తి!

By:  Tupaki Desk   |   15 Sept 2018 12:36 PM
తుపాకీ రాముడు గా బిత్తిరి స‌త్తి!
X
ఇరు తెలుగు రాష్ట్రాల్లో బిత్తిరి స‌త్తి పేరు తెలియని వారుండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. తెలంగాణ యాస‌లో త‌న‌దైన శైలిలో హాస్యాన్ని పండించే బిత్తిరి స‌త్తి తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుడే. త‌న తీన్మార్ వార్త‌ల‌తో పాపుల‌ర్ అయిన సత్తి....అడ‌పాద‌డ‌పా సినిమాల్లో పాత్ర‌లు కూడా చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే బిత్తిరి స‌త్తి హీరోగా `తుపాకీ రాముడు` అనే చిత్రం తెర‌కెక్కుతోంద‌న్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో ఆ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఆ సినిమా పోస్ట‌ర్ - ఫ‌స్ట్ లుక్ ను నేడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ విడుద‌ల చేశారు. ఈ సినిమా సత్తికి మంచి బ్రేక్ ఇవ్వాలని - దర్శకుడు ప్రభాకర్ గారికి మంచి పేరు తీసుకురావాల‌ని సుకుమార్ ఆకాంక్షించారు. చిత్ర యూనిట్ కు ఈ సినిమా మంచి పేరు - సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాన‌ని సుకుమార్ అన్నారు.

'బతుకమ్మ' ఫేమ్ - సీనియర్ దర్శకులు టి. ప్రభాకర్ దర్శకత్వంలో రసమయి ఫిల్మ్స్ పతాకంపై రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2 పాటలు మినహా షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోన్న ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంద‌ని ప్ర‌భాక‌ర్ అన్నారు. బిత్తిరిసత్తిని వైవిధ్యమైన‌ కోణంలో చూపిస్తున్నామ‌న్నారు. సత్తిని త‌మ‌ బ్యానర్‌లో హీరోగా పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంద‌ని, నిర్మాత రసమయి బాలకిషన్ అన్నారు. ఈ చిత్రం సత్తికి మంచి పేరుతో పాటు బిజీ నటుడిని కూడా చేస్తుంద‌న్నారు. త్వరలోనే చిత్ర విడుద‌ల తేదీ, ఇతర వివరాలను వెల్ల‌డిస్తామ‌ని ఆయ‌న అన్నారు.