Begin typing your search above and press return to search.

మా పంచ్ కు తులసి ఎస్కేప్

By:  Tupaki Desk   |   11 July 2017 1:25 PM GMT
మా పంచ్ కు తులసి ఎస్కేప్
X
శంకరాభరణం మూవీలో బాలనటిగా మెప్పించి.. ప్రస్తుతం తల్లి పాత్రల్లో కనిపిస్తున్న నటి తులసి. రీసెంట్ గా ఈమె ఓ వివాదంలో చిక్కుకుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన శివాజీరాజాను జోకర్ అంటూ కామెంట్ చేయడమే ఇందుకు కారణం. శంకరాభరణం అవార్డ్స్ ఫంక్షన్ ను నిర్వహించిన తులసి.. దీనికి చీఫ్ గెస్టుగా జూ. ఎన్టీఆర్ ను ఆహ్వానించింది. అగ్ర నటులెవరూ ఈ ప్రోగ్రాంకు అటెండ్ కాకపోవడానికి కారణం.. శివాజీరాజానే అని తులసి ట్విట్టర్ సాక్షిగా ఆరోపణలు పోస్ట్ అయ్యాయి.

మా ప్రెసిడెంట్ ను ఇన్సల్ట్ చేయడం.. అది కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా కామెంట్స్ చేయడం అంటే.. కాసింత పెద్ద విషయమే. అందుకే తులసిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చూస్తున్నారట. ఇప్పటికే పలువురు లీగల్ అడ్వైజర్లతో కలిసి.. పరువు నష్టం దావా వేసేందుకు శివాజి రాజా ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. టాలీవుడ్ సినిమా నటిగా ఉంటూ.. మా ప్రెసిడెంట్ ను అవమానించడంతో పాటు.. వ్యక్తిగతంగా తన పరువును తీశారనే ఆరోపణలతో కేసులు పెట్టబోతున్నారని అంటున్నారు.

అయితే.. మా నుంచి రాబోతోన్న పంచ్ ను తులసి ముందుగానే పసి గట్టినట్లు చెబుతున్నారు. ఏ ట్విట్టర్ పేజ్ లో అయితే శివాజిరాజాపై తాను ఆరోపణలు చేసినట్లు చెబుతున్నారో.. అది తన ట్విట్టర్ హ్యాండిల్ కాదని ఈ సీనియర్ యాక్ట్రెస్ చెబుతుండడం విశేషం. కథ కేసు వరకూ రాకుండానే.. ముందుగానే ఎస్కేప్ అయేందుకు తులసి ప్రయత్నాలు చేస్తున్నట్లు.. ఫిలిం నగర్ జనాల గుసగుసలాడేసుకుంటున్నారు.