Begin typing your search above and press return to search.

'తుగ్లక్‌ దర్బార్' ట్రైలర్: సేతుపతి - రాశీఖన్నా ల ఫన్నీ పొలిటికల్ డ్రామా

By:  Tupaki Desk   |   31 Aug 2021 6:50 AM GMT
తుగ్లక్‌ దర్బార్ ట్రైలర్: సేతుపతి - రాశీఖన్నా ల ఫన్నీ పొలిటికల్ డ్రామా
X
టాలెంటెడ్ యాక్టర్ 'మక్కల్ సెల్వన్' విజయ్‌ సేతుపతి కి దేశవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకే భాషలో ఇటు హీరోగా అటు విలన్ గా నటించడం సేతుపతికి మాత్రమే చెల్లింది. వరుస సినిమాలు - వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి.. సెప్టెంబర్ నెలలో మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వాటిలో ''తుగ్లక్‌ దర్బార్'' కూడా ఉంది. ఈ చిత్రంలో సేతుపతి సరసన రాశీ ఖన్నా - మంజిమా మోహన్ హీరోయిన్లుగా నటించారు.

కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిన ''తుగ్లక్‌ దర్బార్'' చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయనున్నారు. దిగ్గజ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 10వ తేదీన ఈ సినిమాని స్ట్రీమింగ్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా తమిళ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కామెడీ డ్రామా అని ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ఒక సామాన్యుడు రాజకీయనాయకుడిగా ఎలా ఎదిగాడనేది ఇందులో చూపించారు.

విజయ్ సేతుపతి కన్ను కొడుతున్నట్లు చేసే ఫన్నీ చేష్టలు ట్రైలర్ అంతటా నవ్వులు తెప్పిస్తున్నాయి. అతని పాత్రలో రెండు వెరీయేషన్స్ ఉన్నట్లు సందేహం కలుగుతోంది. సత్యరాజ్ - పార్థీబన్ రాధాకృష్ణన్ - కరుణాకరన్ - భగవతి పెరుమాళ్ - రాజ్ - సంయుక్త ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ట్రైలర్ చివర్లో సేతుపతి - సత్యరాజ్‌ ల మధ్య ఫన్నీ సంభాషణలు నవ్విస్తున్నాయి.

ఢిల్లీ ప్రసాద్‌ దీనాదయలన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ మరియు వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గోవింద్ వసంత ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. 'సంగ తమిజన్' సినిమా తర్వాత విజయ్‌ సేతుపతి - రాశీ ఖన్నా కలిసి చేసిన ''తుగ్లక్‌ దర్బార్'' చిత్రం ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి. ఇకపోతే ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ తో పాటుగా సన్ టీవీలో కూడా ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది.