Begin typing your search above and press return to search.

‘టక్ జగదీష్’ లుక్ రెడీ.. 25న రిలీజ్

By:  Tupaki Desk   |   18 Dec 2020 3:03 PM IST
‘టక్ జగదీష్’ లుక్ రెడీ.. 25న రిలీజ్
X
నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ మూవీ ‘టక్ జగదీష్’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు చిత్రం యూనిట్ సిద్ధమైంది. క్రిస్మస్ కానుకగా.. డిసెంబర్ 25 న ఫస్ట్ లుక్ ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ లో నానీ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

‘‘ఈ క్రిస్మస్ కు #టక్ జగదీష్ ఫస్ట్ లుక్’’ అని హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశాడు నాని. శివ నిర్వాణ దర్శకత్వంలో రెండోసారి నటిస్తున్నాడు ఈ నేచురల్ స్టార్. గతంలో వచ్చిన హిట్ మూవీ ‘నిన్ను కోరి’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో మూవీ ఇది. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోందని టాక్.

ఈ సినిమా షూటింగ్ కొంత భాగం లాక్ డౌన్ కు ముందే పూర్తి చేశారు. మిగిలిన పార్ట్ ను చిత్రీకరించేందుకు ఇటీవలే షూటింగ్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ప్రస్తుతం చిత్రీకరణ చివ‌రి షెడ్యూల్లోకి ప్ర‌వేశించింది. నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ ప్రొడక్ట్ చేస్తున్న ఈ మూవీకి థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.