Begin typing your search above and press return to search.

టక్ చేసుకొని సెట్స్ లో అడుగుపెట్టిన నేచురల్ స్టార్...!

By:  Tupaki Desk   |   7 Oct 2020 5:00 PM GMT
టక్ చేసుకొని సెట్స్ లో అడుగుపెట్టిన నేచురల్ స్టార్...!
X
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''టక్‌ జగదీష్‌''. 'నిన్ను కోరి' 'మజిలీ' వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రీతూ వర్మ - ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాని కెరీర్లో 26వ చిత్రంగా వస్తున్న 'టక్‌ జగదీష్‌' పై సినీ వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కి విశేష స్పందన వచ్చింది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ప్రభుత్వం లాక్‌ డౌన్ సడలింపుల్లో భాగంగా షూటింగ్‌ లకు గ్రీన్ సిగ్నల్ రావడంతో.. నాని 'టక్‌ జగదీష్‌' కూడా సెట్స్ లో అడుగుపెట్టేసాడు.

'టక్‌ జగదీష్‌' షూటింగ్ దాదాపు 7 నెల‌ల విరామం త‌ర్వాత హైదరాబాద్‌ లో తిరిగి మొద‌లు పెట్టారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా 'టక్‌ జగదీష్‌' టీమ్ చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం హీరో నాని పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. షూటింగ్ స్టార్ట్ చేసిన విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ నానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో నాని బ్యాక్ సైడ్ వ్యూ లో నీట్ గా టక్ చేసుకొని.. చేతిలో మాస్క్ పట్టుకొని కనిపిస్తున్నాడు. ఈ షెడ్యూల్ ముగిసిన తరువాత ఏపీలోని తూర్పు గోదావరి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహు గార‌పాటి - హ‌రీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. నాని - శివ నిర్వాణ కాంబోలో వస్తున్న రెండో సినిమా ''టక్‌ జగదీష్‌'' కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.