Begin typing your search above and press return to search.

మేకింగ్ వీడియో: జగది - గుమ్మ కలిసి పాడుకుంటున్న 'ఇంకోసారి ఇంకోసారి' గీతం

By:  Tupaki Desk   |   3 April 2021 4:17 PM GMT
మేకింగ్ వీడియో: జగది - గుమ్మ కలిసి పాడుకుంటున్న ఇంకోసారి ఇంకోసారి గీతం
X
నేచురల్ స్టార్ నాని - రీతూ వర్మ - ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ''టక్ జగదీష్''. 'నిన్ను కోరి' 'మజిలీ' వంటి సున్నితమైన ప్రేమకథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 23న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ -సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. 'ఇంకోసారి ఇంకోసారి' లిరికల్ సాంగ్ యూట్యూబ్ లో సుమారు 5 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పాట మేకింగ్ వీడియోని చిత్ర యూనిట్ వదిలారు.

గోదావరి జిల్లాలలో అందమైన లొకేషన్స్ లో ఈ సాంగ్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 'ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి' అంటూ సాగిన ఈ పాటను జగదీష్ నాయుడు - గుమ్మడి వరలక్ష్మి పాత్రల్లో కనిపించనున్న నాని - రీతూ వర్మ లపై షూట్ చేశారు. థమన్ స్వరపరిచిన ఈ మ్యాజికల్ మెలోడీని అంతే అందంగా తీయడానికి డైరెక్టర్ శివ నిర్వాణ తన టీమ్ తో కలిసి వర్క్ చేసినట్లు అర్థం అవుతోంది. చైతన్య ప్రసాద్ సాహిత్యం రాసిన ఈ గీతాన్ని శ్రేయా ఘోషల్ - కాలభైరవ కలిసి ఆలపించారు. రఘు మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేశారు. ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందించగా.. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేశారు.

కాగా, విలేజ్ బ్యాక్ డ్రాప్‌ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో నాని అన్నగా సీనియర్ హీరో జగపతి బాబు.. తండ్రిగా నాజర్ నటించారు. డేనియల్ బాలాజీ - ప్రియదర్శి - తిరువీర్ - రోహిణి - ప్రవీణ్ ఇతర పాత్రలు పోషించారు. ఏప్రిల్ 13న వైజాగ్ లో 'టక్ జగదీష్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్.. ఏప్రిల్ 18న హైదరాబాద్ లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌ పై సాహు గార‌పాటి - హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు.