Begin typing your search above and press return to search.

'ట‌క్‌ జ‌గ‌దీష్' మళ్లీ ఆగిందనే వార్తలకు చెక్ పెట్టిన డైరెక్టర్...!

By:  Tupaki Desk   |   22 Oct 2020 1:30 PM GMT
ట‌క్‌ జ‌గ‌దీష్ మళ్లీ ఆగిందనే వార్తలకు చెక్ పెట్టిన డైరెక్టర్...!
X
నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ''టక్ జగదీష్''. కోవిడ్ ప్ర‌భావంతో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ మ‌ళ్లీ అక్టోబ‌ర్ 5న హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మూవీ టీమ్ చిత్రీకరణ చేస్తున్నట్లు ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే 'ట‌క్‌ జ‌గ‌దీష్' మళ్లీ ఆగిందని.. యూనిట్‌ లోని ఓ టెక్నీషియ‌న్‌ కి కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా సినిమా షూటింగ్‌ ఆపేశారని.. ప్రస్తుతం టీమ్ మొత్తం హోమ్ ఐసోలేష‌న్‌ లో ఉంద‌ని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా డైరెక్టర్ శివ నిర్వాణ ఈ వార్తలకు చెక్ పెడుతూ ట్విట్టర్ లో ఓ వీడియో రిలీజ్ చేశాడు.

''అన్ స్టాపబుల్.. #ట‌క్‌ జ‌గ‌దీష్ సెట్స్‌ లో 38వ రోజు'' అని శివ నిర్వాణ ట్వీట్ చేస్తూ ఓ వీడియో జత చేసాడు. ఓ వీడియో ద్వారా సెట్ లో శానిటైజ్ చేస్తూ కోవిడ్ నిబంధలు పాటిస్తూ చిత్ర యూనిట్ షూటింగ్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో 'ట‌క్‌ జ‌గ‌దీష్' మళ్లీ ఆగిందనే వార్తలకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు. కాగా, రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రీతూ వర్మ - ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌ పై సాహు గార‌పాటి మరియు హ‌రీశ్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని కెరీర్లో 26వ చిత్రంగా వస్తున్న 'టక్‌ జగదీష్‌' పై సినీ వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అలానే 'నిన్నుకోరి' వంటి సక్సెస్ ఫుల్ సినిమా త‌ర్వాత నాని - శివ నిర్వాణ కాంబినేష‌న్‌ లో రూపొందుతోన్న సినిమా కావడంతో అభిమానులు నమ్మకంగా ఉన్నారు.