Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: టక్ చేసుకుని బరిలో దిగిన జగదీష్ నాయుడు..!

By:  Tupaki Desk   |   25 Dec 2020 10:36 AM IST
ఫస్ట్ లుక్: టక్ చేసుకుని బరిలో దిగిన జగదీష్ నాయుడు..!
X
నేచుర‌ల్ స్టార్ నాని - దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ 'టక్ జగదీష్'. నాని నటిస్తున్న ఈ 26వ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌ పై సాహు గార‌పాటి - హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నాని కి జోడీగా రీతూ వ‌ర్మ‌ - ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రిష్మస్ కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో అందరిలో క్యూరియాసిటీ మొదలైంది. ఈ క్రమంలో తాజాగా 'టక్ జగదీష్' ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

'టక్ జగదీష్' టైటిల్ పోస్టర్ ని లో టక్ చేసుకుని నిలబడిన నాని బ్యాక్ సైడ్ లుక్ ని చూపించిన మేకర్స్.. ఫస్ట్ లుక్ లో నీట్ గా టక్ చేసుకుని కూర్చున్న నాని ని చూపించారు. ఇందులో నాని ఫార్మల్ డ్రెస్ లో క్లాస్ గా కనిపిస్తూ లుక్ పరంగా కంప్లీట్ ఆపోజిట్ లో మాస్ గా కనిపిస్తున్నాడు. అరిటాకులో భోజనం చేయడానికి కూర్చున్న మన టక్ జగదీష్.. వెనుక నుంచి కత్తి తీస్తూ కోపంగా చూస్తూ ఉన్నాడు. సింగిల్ పోస్టర్ లో నాని అటు క్లాస్ ని ఇటు మాస్ ని చూపించి ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు.

'నిన్నుకోరి' వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా త‌ర్వాత నాని - శివ నిర్వాణ కాంబోలో మరో సూపర్ హిట్ రాబోతోందని ఫస్ట్ లుక్ చూస్తే అర్థం అవుతోంది. ఈ సందర్భంగా 'టక్ జగదీష్' చిత్రాన్ని 2021 ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్‌. థమన్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌ గా వర్క్ చేస్తుండగా.. ప్ర‌వీణ్ పూడి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో నాజర్ - డేనియల్ బాలాజీ - ప్రియదర్శి - తిరువీర్ - రోహిణి - ప్రవీణ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైద‌రాబాద్‌ లో షూటింగ్ జరుపుకుంటోంది.