Begin typing your search above and press return to search.
#TTT తమన్ ఫుల్ జోష్ లో ఉన్నాడే
By: Tupaki Desk | 12 May 2018 12:57 PM ISTప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్లు జోషులో ఉన్న సంగీత దర్శకుడు ఎవరంటే తమనే. ఆయన సంతోషానికి కారణం టాలీవుడ్లో క్రేజీయెస్ట్ మూవీగా తెరకెక్కుతున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్- యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్ కాంబి సినిమాకు సంగీతం అందిస్తుండడమే. త్రివిక్రమ్ తో పనిచేయాలని ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్న తమన్... అనుకోకుండా వచ్చిన అవకాశంతో ఉబ్బితబ్బివవుతున్నాడు.
ఈ సినిమాకి ఇప్పటికే ట్యూన్స్ కంపోజ్ చేయడం మొదలెట్టిన తమన్... దర్శకుడు- హీరోలతో కలిసి ఇలా నవ్వుతూ ఫోటోకి ఫోజిచ్చాడు. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాకముందే రాజమౌళి- రామారావు- రామ్ చరణ్ మూవీ #RRR ట్యాగ్ తరహాలో... త్రివిక్రమ్- తారక్- తమన్ పేర్లను ప్రతిబింబించేలా #TTT అనే ట్యాగ్ లైన్ జత చేసి ఓ చిన్న తరహా ఓటింగ్ కూడా నిర్వహించాడు తమన్ సోషల్ మీడియాలో. ఇప్పుడు రికార్డింగ్ స్టూడియో సెట్స్ నుంచి ఈ ఫోటోని షేర్ చేస్తూ మరో సారి... #TTT పెట్టి అభిమానులతో షేర్ చేశాడు ఈ కుర్ర సంగీత దర్శకుడు. రాజమౌళి మల్టీస్టారర్ కి వచ్చినంత క్రేజ్ తన హ్యాష్ ట్యాగ్ కి కూడా రావాలని తెగ ప్రయత్నిస్తున్నాడు తమన్.
జెట్ స్పీడుతో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిన తమన్... ఇప్పుడున్న స్పీడుతో దూసుకుపోతే మాత్రం త్వరలో అత్యంత తక్కువ సమయంలో సెంచరీ సినిమాలు కంప్లీట్ చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్‌గా సరికొత్త రికార్డు సృష్టించడం కూడా ఖాయం. అజ్ఞాతవాసి సినిమా మ్యూజిక్ మరీ క్లాసీగా సాగి ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. అందుకే తారక్- త్రివిక్రమ్ మూవీ కోసం జానపద గేయాల టైపులో ఉండే ఊర మాస్ బీట్ మ్యూజిక్ తయారుచేస్తున్నట్టు టాక్.