Begin typing your search above and press return to search.

EMK : ఎన్టీఆర్‌ గేమ్‌ షో లో కోటీశ్వరుడైన టీఎస్‌ పోలీస్‌

By:  Tupaki Desk   |   14 Nov 2021 5:30 AM GMT
EMK : ఎన్టీఆర్‌ గేమ్‌ షో లో కోటీశ్వరుడైన టీఎస్‌ పోలీస్‌
X
హిందీలో సూపర్‌ హిట్ అయ్యి చాలా ఏళ్లుగా కొనసాగుతున్న షో కౌన్ బనేగా కరోడ్‌ పతి. అమితాబచ్చన్‌ హోస్టింగ్‌ చేస్తున్న ఆ షో ను తెలుగు లో కూడా మొదట స్టార్‌ మా వారు నాగార్జున మరియు చిరంజీవిలతో చేయించారు. కాని తెలుగు లో ఈ షో అంతగా జనాలకు ఎక్కలేదు. దాంతో స్టార్‌ మా ఆ షో ను పక్కకు పెట్టింది. స్టార్‌ మాలో ఈ షో టెలికాస్ట్‌ అయిన సమయంలో కోటి రూపాయలు దక్కించుకున్న కంటెస్టెంట్ ఎవరు లేరు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా జెమిని టీవీలో కాస్త పేరు మార్చి ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ చేస్తున్నారు. ఈ సీజన్ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో ఈసారి అయినా ఏ ఒక్కరు కోటి రూపాయల ప్రశ్నను ఎదుర్కొని సమాధానం చెప్పలేక పోయారు అనుకుంటూ ఉండగా అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ లో సబ్ ఇన్సిపెక్టర్ గా జాబ్‌ చేస్తున్న వ్యక్తి కోటి రూపాయలను గెలుచుకున్నాడు.

కొత్తగూడెం సబ్ ఇన్సిపెక్టర్ అయిన రాజ రవీంద్ర ఈ అరుదైన రికార్డును దక్కించుకున్నాడు. చదువుతో పాటు ఎన్నో విషయాల్లో అద్బుతమైన నాలెడ్జ్ ఉన్న ఈయనకు రైఫిల్ షూటింగ్‌ అంటే చాలా ఇష్టం. జాతీయ స్థాయిలో కూడా ఈయన ఛాంపియన్ గా నిలిచారు. ఎప్పటికైనా ఒలింపిక్స్ లో షూటింగ్ లో పథకం దక్కించుకోవాలని ఆశ పడుతున్నాడు. అయితే పరిస్థితులు అందుకు అనుకూలించక పోవడంతో అక్కడి వరకు వెళ్లలేక పోయాను అంటూ రాజా రవీంద్ర చెప్పుకొచ్చారు. ఈ కోటి రూపాయలతో తాను అనుకున్నది సాధించేందుకు కృషి చేస్తాను అన్నాడు. అంతర్జాతీయ స్థాయి షూటింగ్ కోచింగ్‌ ను తీసుకుని ఒలింపిక్స్ కు వెళ్లాలని ఆశ పడుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్‌ ఎవరు మీలో కోటీశ్వరులు షో చాలా నీరసంగా సాగుతుంది అనుకుంటూ ఉండగా అనూహ్యంగా ఇలాంటి ఒక బ్రేక్‌ రావడం ఎన్టీఆర్‌ అభిమానులకు ఆనందంగా ఉంది. ఈ ఎపిసోడ్‌ కు మంచి రేటింగ్ దక్కుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఆగస్టులో ప్రారంభం అయిన ఈ షో ను డిసెంబర్‌ వరకు కొనసాగించాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల షో ను ముందుగానే ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోటి రూపాయల ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేయడం జరిగింది. ఆ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక ఎన్టీఆర్‌ సినిమాల విషయానికి వస్తే ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎన్టీఆర్‌ వచ్చే నెల నుండి హాజరు అవ్వబోతున్నాడు. మరో వైపు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను ఎన్టీఆర్‌ నటించబోతున్నాడు. ఆ సినిమా పట్టాలెక్కేది ఎప్పుడు అనే విషయం త్వరలో అధికారికంగా క్లారిటీ రాబోతుంది.