Begin typing your search above and press return to search.

కాస్త డిఫరెంట్‌ గా ట్రై చెయ్‌ భయ్యా.. మెగా హీరోకు ఫ్యాన్స్ సలహా

By:  Tupaki Desk   |   8 May 2022 12:30 AM GMT
కాస్త డిఫరెంట్‌ గా ట్రై చెయ్‌ భయ్యా.. మెగా హీరోకు ఫ్యాన్స్ సలహా
X
మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలతో బిజీ అవ్వబోతున్నాడు. యాక్సిడెంట్ వల్ల షూటింగ్ లకు ఆయన ఇన్నాళ్లు దూరం అయ్యాడు. సాయి ధరమ్‌ తేజ్‌ గత చిత్రం రిపబ్లిక్ కమర్షియల్ గా సక్సెస్‌ కాలేదు. ఆ సినిమా నిరాశ పర్చడంతో మరో మంచి సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో మాస్ దర్శకుడు సంపత్‌ నంది దర్శకత్వంలో సాయి ధరమ్‌ తేజ్ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

సంపత్‌ నంది అంటే మాస్ చిత్రాల దర్శకుడు.. ఆయన మాస్ సబ్జెక్ట్స్‌ ను బాగా డీల్‌ చేస్తాడు అనే టాక్ ఉంది. అలాంటి దర్శకుడితో సాయి ధరమ్‌ తేజ్ సినిమా అనగానే ఒక వర్గం ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కాని కొందరు మెగా అభిమానులు మాత్రం సాయి ధరమ్‌ తేజ్ సినిమాల ఎంపిక విషయంలో కాస్త అసంతృప్తితో ఉన్నట్లుగా అనిపిస్తుంది.

వైష్ణవ్ తేజ్ నుండి మొదలుకుని పలువురు మెగా హీరోలు ఇతర హీరోలు తమ సినిమా సినిమాకు స్టైల్‌ మార్చుతూ విభిన్నంగా ప్రేక్షకుల ముందుకు రావాలని.. విభిన్నమైన సినిమాలను చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొందరు మంచి విజయాలను దక్కించుకుంటే మరి కొందరు మాత్రం పెద్దగా ఆకట్టుకోవడంలో విఫలం అవుతున్నారు. సాయి ధరమ్‌ తేజ్ ను అభిమానులు ఇప్పుడు కాస్త డిఫరెంట్‌ గా ట్రై చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇప్పటికే సాయి ధరమ్‌ తేజ్ చాలా కమర్షియల్‌ సినిమాలు చేశాడు. ఆ సినిమాల్లో కొన్ని ఆకట్టుకోగా కొన్ని పర్వాలేదు అనిపించాయి. కనుక ఇప్పుడు సంపత్‌ నంది వంటి మాస్ మసాలా దర్శకుడితో కాకుండా కాస్త సాఫ్ట్‌ డైరెక్టర్ తో విభిన్నమైన నేపథ్యంలో సినిమా చేస్తే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంపత్‌ నందితో తర్వాత అయినా చేయవచ్చు అనేది వారి అభిప్రాయం.

సాయి ధరమ్‌ తేజ్ విభిన్నమైన సినిమాలను మరియు పాత్రలను ట్రై చేస్తే బాగుంటుందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆయన రెగ్యులర్ మాస్‌ సినిమాలకే బాగా సెట్‌ అవుతాడు అనే అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్నారు.

సినీ విశ్లేషకులు మాత్రం రెగ్యులర్ గా ఒక తరహా సినిమాలు కాకుండా అప్పుడప్పుడు విభిన్నమైన సినిమాలను ట్రై చేయాలంటూ సూచిస్తున్నారు. రిపబ్లిక్ తో విభిన్నత్వంను ప్రయత్నించాడు. కాని అది విఫలం అయినా మళ్లీ మరో ప్రయత్నం చేయాలంటూ ఆయనకు సూచన చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మరి తేజూ తర్వాత సినిమా ఏంటీ అనేది చూడాలి.