Begin typing your search above and press return to search.

ఎదురుగా ప్ర‌భాస్‌.. డైలాగ్ చెప్ప‌మంటే హీరోయిన్ ఏమందో తెలుసా?

By:  Tupaki Desk   |   18 March 2021 2:30 AM GMT
ఎదురుగా ప్ర‌భాస్‌.. డైలాగ్ చెప్ప‌మంటే హీరోయిన్ ఏమందో తెలుసా?
X
బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ ఓ నేష‌న‌ల్ ఐకాన్‌. ఛాన్స్ దొరికితే ఆయ‌న‌తో సినిమా లాగించేయాల‌ని మేక‌ర్స్‌.. అవ‌కాశం ల‌భిస్తే.. స్క్రీన్ షేర్ చేసుకోవాల‌ని న‌టీన‌టులు కోరుకుంటున్నారు. ఇక‌, హీరోయిన్ల గురించి చెప్ప‌డానికి ఏముందీ..? రెబల్ స్టార్ తో సినిమా చేస్తే చాలు.. ఫుల్ పాపులర్ అయిపోవచ్చని చూస్తున్నారు. ఇలానే అనుకున్న ఓ హీరోయిన్ కు సెట్లోకి వెళ్లిన త‌ర్వాత నోట మాట రాలేద‌ట‌!

ప్రస్తుతం వ‌రుస సినిమాల‌ను లైన్లో పెట్టాడు ప్ర‌భాస్‌. రాధేశ్యామ్ ను కంప్లీట్ చేసిన ప్ర‌భాస్‌.. ఇటు ‘స‌లార్’ సాలిడ్ గా రన్ చేస్తూనే.. అటు ‘ఆదిపురుష్’ను కూడా స్టార్ట్ చేశాడు. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోంది.

రామాయ‌ణం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో కృతి స‌న‌న్ సీత పాత్ర పోషిస్తోంది. అయితే.. ఇందులో మ‌రో బ్యూటీ కూడా న‌టిస్తోంది. తృప్తి తోరడ్ మ‌ల్ స్పెష‌ల్ క్యారెక్ట‌ర్లో న‌టిస్తోంది. అయితే.. సెట్స్ లోకి వెళ్లిన తృప్తికి.. తొలిరోజే ప్ర‌భాస్ తో క‌లిసి న‌టించే సీన్ వ‌చ్చింద‌ట‌.

షాట్ రెడీ అన్న త‌ర్వాత కెమెరా ముందుకు వెళ్లిన‌ తృప్తి.. డైలాగ్ చెప్ప‌డానికి త‌డ‌బ‌డింద‌ట‌. ఎదురుగా ఉన్న ప్ర‌భాస్ ను చూసి కంగారు ప‌డిన ఆమె.. స‌రిగా యాక్టింగ్ చేయ‌లేక‌పోయిందిట‌. ఆమె ప‌రిస్థితిని గ‌మ‌నించిన ప్ర‌భాస్‌.. ఏం ప‌ర్వాలేద‌ని, కూల్ గా చేయ‌మ‌ని స‌పోర్ట్ చేశాడ‌ట‌. ఈ విష‌యాన్ని తాజాగా వెల్ల‌డించిన తృప్తి తోరడ్ మ‌ల్.. ప్ర‌భాస్ ను ఆకాశానికెత్తేసింది. అంత పెద్ద స్టార్ అయిన‌ప్ప‌టికీ.. ఎలాంటి ఫీలింగ్స్ ఉండ‌వ‌నీ, సెట్లో అంద‌రితో క‌లిసిపోతాడంటూ పొగ‌డ్త‌ల్లో ముంచెత్తింది.