Begin typing your search above and press return to search.

ఆ సీన్ మీద ట్రోలింగ్.. ఆమె కనిపెట్టేసింది

By:  Tupaki Desk   |   4 Jun 2018 5:50 AM GMT
ఆ సీన్ మీద ట్రోలింగ్.. ఆమె కనిపెట్టేసింది
X
ఇవాల్టి రోజుల్లో ట్రాలింగ్ అనే పాయింట్ కామన్ గానే కనిపిస్తూనే ఉంది. దీనికి గురి కాని సెలబ్రిటీలు ఒక్కరు కూడా ఉండరంటే ఆ మాటలో పొరపాటేమీ లేదు. కానీ ఈ ట్రాలింగ్ లో కూడా ఉద్దేశ్యపూర్వకంగా కొందరు చేయిస్తున్నారనే విషయం ఇప్పుడు బాగా హైలైట్ అవుతోంది.

రీసెంట్ గా వీరే ది వెడ్డింగ్ అంటూ ఓ బాలీవుడ్ మూవీ వచ్చింది. నలుగురు అమ్మాయుల వ్యక్తిగతాన్ని.. చాలా బోల్డ్ గా చూపించే ప్రయత్నం చేశారు. టీజర్.. ట్రైలర్ నుంచే సెన్సేషన్స్ సృష్టించిన ఈ మూవీలో కరీనా కపూర్.. సోనమ్ కపూర్ లతో పాటు స్వరభాస్కర్ కూడా కనిపించింది. ఓ సన్నివేశంలో స్వరభాస్కర్ స్వయంతృప్తి పొందుతూ కనిపిస్తుంది. ఇందులో ఆమె వైబ్రేటర్ ఉపయోగించి లైంగిక సంతృప్తి పొందుతున్నట్లుగా ఆ సీన్ ఉంటుంది. ఇలాంటి సీన్స్ ను ఇండియాలో ఎలా రిసీవ్ చేసుకుంటారో.. వాటిపై ట్రాలింగ్ ఎలా జరుగుతుందో ముందే ఊహించవచ్చు.

అయితే.. ఇక్కడ స్వరభాస్కర్ ఓ కొత్త పాయింట్ ను రైజ్ చేసింది. తనపై ట్రాలింగ్ చేస్తున్న ట్వీట్స్ లో అనేకం ఒకే తరహా పదజాలంతో చేస్తుండడం ఆమె పాయింట్ చేసింది. ఇలా జరిగేది ఒక్క పెయిడ్ ట్వీట్స్ మాత్రమే అనే సంగతి చెప్పాల్సిన పని లేదు. తనను టార్గెట్ చేసి పెయిడ్ ట్రాలింగ్ చేస్తుండడాన్ని స్వరభాస్కర్ సీరియస్ గానే తీసుకుంది. మరి ఎలాంటి యాక్షన్ తీసుకోనుందో చూడాలి.