Begin typing your search above and press return to search.

చైతూ కు ప్రశంసలు.. సామ్ పై ట్రోల్స్..!

By:  Tupaki Desk   |   22 July 2022 11:40 AM GMT
చైతూ కు ప్రశంసలు.. సామ్ పై ట్రోల్స్..!
X
టాలీవుడ్ బెస్ట్ కపుల్ అనిపించుకున్న అక్కినేని నాగచైతన్య - సమంత జంట.. గతేడాది విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరు మార్గాల్లో ముందుకు వెళ్తున్నారు. చై సామ్ విడిపోయి వైజామ్మిది6నెలలు కావొస్తున్నా.. ఈ వ్యవహారంపై ఇప్పటికీ ఏదొక వార్త వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు సామ్ ఓ టాక్ షోలో చైతూ విషయం వచ్చినప్పుడు సమంత స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న 'కాఫీ విత్ కరణ్' టాక్ షోకి సమంత గెస్టుగా హాజరైంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో కరణ్ తన విడాకుల గురించి ప్రస్తావించగా సామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నువ్వు నీ భర్త విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత..' అంటూ కరణ్ అంటుండగా.. మధ్యలో "మాజీ భర్త" అని సమంత అని ఒకింత సీరియస్ గానే మాట్లాడింది.

అలానే మీ మధ్య ఇంకా ఏవైనా హార్డ్ ఫీలింగ్స్ ఉన్నాయా? అని కరణ్ ప్రశ్నించగా.. ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే మీరు పదునైన వస్తువులు దాచాల్సి ఉంటుంది అని సమంత చెప్పింది. దీనిని బట్టి తన ఎక్స్ హస్బెండ్ పై ఆమెకు చాలా కోపం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. పొరపాటున అతన్ని తన భర్తగా పిలవడాన్ని కూడా ఇష్టపడటం లేదంటేనే ఆమెలో ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే మరోవైపు నాగచైతన్య మాత్రం తన మాజీ భార్య సమంత గురించి భిన్నంగా స్పందించారు. 'థాంక్యూ' ప్రమోషన్స్ లో భాగంగా చైతూ ఓ తమిళ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా 'స్క్రీన్ పై మీతో బెస్ట్ కెమిస్ట్రీని పంచుకున్న హీరోయిన్ ఎవరు?' అని యాంకర్ ప్రశ్నించగా సమంత మరియు సాయి పల్లవి అని చెప్పాడు చై.

'లవ్ స్టోరీ' సినిమాలో సాయి పల్లవితో మంచి కెమిస్ట్రీని పంచుకున్నాను. సమంత, నేను కలిసి స్క్రీన్ పై మంచి ప్రేమకథలు కూడా చేశాం. నన్ను అడిగితే నేను సాయి పల్లవి మరియు సామ్ అని చెబుతాను అని నాగచైతన్య చెప్పుకొచ్చారు. చైతూ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా తన మాజీ భార్య పేరు పక్కన పెట్టకుండా ఆమె గురించి స్పందించిన తీరు.. అక్కడ కరణ్ జోహార్ షోలో చై గురించి సామ్ స్పందించిన విధానం పూర్తి భిన్నంగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చై సామ్ అభిమానులు పరస్పరం విరుద్ధ భావాలను వ్యక్తం చేస్తూ ఫైట్ చేస్తున్నారు. సమంత గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎలాంటి అహం లేకుండా చైతూ ఆమె పేరు చెప్పాడని ఓవర్గం ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు టాక్ షోలో నాగచైతన్య పేరు ప్రస్తావించనప్పటికీ.. తన మాజీ భర్త ప్రస్తావన తెచ్చినప్పుడల్లా సమంత తన హావభావాలను మార్చేసింది. పొరపాటున ఎక్స్ హస్బెండ్ అన్నందుకే సామ్ సీరియస్ అయిందని.. ఇద్దరినీ ఒకే రూమ్ లో ఉంచితే పదునైన వస్తువులను దాచవలసి ఉంటుందని కూడా చెప్పింది. చై సామ్ మెచ్యూరిటీ లెవల్స్ లో వ్యత్యాసాన్ని చూపిస్తుందని కామెంట్ చేస్తున్నారు.

విడిపోయిన తర్వాత మాజీ భర్త అనే అంటారు. అందులో తప్పేముందని సమంత మద్దతుదారులు అంటున్నారు. వారి మధ్య జరిగిన వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకునే ఒకే గదిలో ఇద్దరం ఉండలేమన్నట్లుగా అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు.