Begin typing your search above and press return to search.

'పుష్ప' శ్రీవల్లిపై సోషల్ మీడియా ట్రోల్స్‌

By:  Tupaki Desk   |   1 Oct 2021 9:30 AM GMT
పుష్ప శ్రీవల్లిపై సోషల్ మీడియా ట్రోల్స్‌
X
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా నుండి తాజాగా హీరోయిన్ రష్మిక మందన్న ఫస్ట్‌ లుక్‌ రివీల్‌ అయ్యింది. శ్రీవల్లి అనే మాస్ రఫ్‌ పాత్రలో రష్మిక కనిపించబోతుంది. రష్మిక మాస్ గా కనిపించబోతున్నట్లుగా మొదటి నుండే సమాచారం ఉంది. అల్లు అర్జున్ లుక్‌ తర్వాత రష్మిక పాత్ర లుక్ ను చాలా మంది ఇదే తరహాలో ఊహించుకున్నారు. మొదటి సారి పూర్తి స్థాయి మాస్ పాత్రలో ఆమె కనిపించబోతుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు పుష్ప శ్రీవల్లి లుక్ వచ్చేసింది. అంతా అనుకున్నట్లుగానే రష్మిక లుక్‌ ఉంది. రష్మిక ఖచ్చితంగా ఈ పాత్రకు పూర్తి న్యాయం చేస్తుందనే నమ్మకంను అభిమానులు మరియు ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ లుక్ లో ఆమె దిబెస్ట్‌ అనడంలో సందేహం లేదు. కాని దర్శకుడు సుకుమార్‌ ఈ స్టిల్‌ కాకుండా మరేదైనా స్టిల్‌ ను ఫస్ట్‌ లుక్ గా విడుదల చేసి ఉంటే బాగుండేది అంటూ ఆమె అభిమానులు మరియు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పుష్ప శ్రీవల్లి లుక్ బాగుంది కాని.. ఆమె ను చూపించిన విధానం సరిగా లేదని కొందరు అంటున్నారు. మాస్ పాత్ర కాబట్టి సీట్టింగ్‌ లుక్‌ అయితేనే మాస్ గా ఉంటుంది అనుకుని సుకుమార్‌ ఈ ఫోజ్ లో ఆమె ఫొటోను విడుదల చేసి ఉంటాడు. కాని రష్మిక లుక్ బాగున్నా ఆమె కూర్చున్న విధానం సరిగా లేదని.. రంగస్థలం సినిమా నుండి సమంత ఫస్ట్ లుక్ వచ్చిన సమయంలో అంతా కూడా వావ్‌ అన్నారు. ఆ రేంజ్ లో ఉంటుందని ఆశిస్తే లుక్‌ విషయం పక్కన పెడితే ఆమె గ్లామర్‌ చూపించక పోవడంతో పాటు కాస్త ఎబెట్టుగా ఉన్న స్టిల్ ను విడుదల చేశారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నెట్టింట రష్మిక సిట్టింగ్ పొజీషన్ గురించి ఎవరికి వచ్చినట్లుగా వారు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. రంగస్థలం రంగమ్మత్త ఫస్ట్‌ లుక్ తరహాలో అయినా కూర్చిన కాస్త మాసీ లుక్‌ తో రష్మిక ఉన్నట్లయితే బాగుండేది అంటూ కొందరు సినీ అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియాలో పుష్ప సినిమా తాలూకు రష్మిక మందన్న లుక్ విషయంలో ట్రోల్స్ వస్తున్నాయి.

అల్లు అర్జున్‌ మాస్‌ లుక్‌ కు రష్మిక మాస్ లుక్‌ సరిగ్గా సెట్ అయినట్లుగా అనిపిస్తుంది. ఇద్దరి కాంబోను ఎప్పుడెప్పుడు వెండి తెరపై చూస్తామా అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు. రామ్‌ చరణ్ మరియు సమంతల ను రంగస్థలంలో మాస్ లుక్ అయినా రఫ్‌ లుక్ అయినా కూడా చాలా అందంగా కన్విన్సింగ్‌ గా చూపించాడు. కనుక ఖచ్చితంగా పుష్ప లోని ఈ జంట కూడా ఖచ్చితంగా అభిమానులను అలరించే విధంగా ఉంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట పుష్ప కు సంబంధించిన శ్రీవల్లి ఫొటోలను మీమ్స్ గా క్రియేట్‌ చేసి కొందరు నవ్వులు పూయిస్తుంటే మరి కొందరు మాత్రం వల్గర్ గా రష్మిక మందన్నా ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పుష్ప పార్ట్‌ 1 ను డిసెంబర్ లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అతి త్వరలోనే మరోసారి విడుదల తేదీపై మరింత స్పష్టత ఇస్తారేమో చూడాలి.