Begin typing your search above and press return to search.

హ‌జ్బెండ్ న్యూడ్‌.. వైఫ్ సెమీ న్యూడ్‌!

By:  Tupaki Desk   |   14 Dec 2022 1:30 PM GMT
హ‌జ్బెండ్ న్యూడ్‌.. వైఫ్ సెమీ న్యూడ్‌!
X
బాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట‌లు నెట్టింట వైర‌ల్ గా మారడం.. ఓ ద‌శ‌లో హ‌ద్దులు దాటి వారు చేసే చేష్ట‌ల‌కు నెటిజ‌న్ ల ఆగ్ర‌హానికి గురై దారుణ ట్రోలింగ్ గురి కావ‌డం తెలిసిందే. ఈ మ‌ధ్య బాలీవుడ్ క్రేజీ జంట ర‌ణ్ వీర సింగ్‌, దీపికా పదుకునే ఇదే త‌ర‌హాలో నెటిజ‌న్ ల ఆగ్ర‌హానికి గురై దారుణంగా ట్రోలింగ్ కి గుర‌వుతున్నారు. ఇటీవ‌ల బాలీవుడ్ లో క్రేజీ స్ఆర్ ఆ పేరు తెచ్చుకున్న ర‌ణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫొటో షూట్ లో పాల్గొన‌డంతో ఆ ఫొటోలు సోష‌ల్‌మీడియాని ఓ రేంజ్ లో షేక్ చేశాయి.

ర‌ణ్ వీర్ న్యూడ్ ఫొటో ల‌పై నెట్టింట పెద్ద దుమార‌మే చెల‌రేగింది. ఎలాంటి క్లాత్స్ లేకుండా బోల్డ్ గా ర‌ణ్ వీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫొటో షూట్ నెట్టింట వైర‌ల్ కావ‌డం.. ఫొటోలు చాలా వ‌ర‌కు అస‌భ్య‌కరంగా.. అభ్యంత‌ర‌కంగా వుండంతో కొంత మంది నెటిజ‌న్ లు తీవ్ర స్థాయిలో ర‌ణ్ వీర్ సింగ్ పై విరుచుకుప‌డి త‌న‌ని నెట్టింట దారుణంగా ట్రోల్ చేయ‌డం తెలిసిందే. కొంత మంది నెటిజ‌న్ లు మ‌రీ ర్ వీర్ సింగ్ న్యూడ్ ఫొటోలు అభ్యంత‌ర‌కంగా వున్నాయ‌ని పోలీసుల‌ని ఆశ్ర‌యించ‌డం.. త‌న‌పై కేసు న‌మోదు కావ‌డం తెలిసిందే.

గ‌త కొన్ని రోజుల క్రితం నెట్టింట సంచ‌ల‌నం సృష్టించిన ర‌ణ్ వీర్ న్యూడ్ ఫొటో షూట్ పై పోలీసులు తీవ్రంగా స్పందించ‌డం.. త‌న‌ని విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించ‌డంఓ ర‌ణ్ వీర్ సింగ్ మొత్తానికి పోలీసుల ఎదుట హాజ‌రు కావ‌డం. విచార‌ణ ఎదుర్కొని అవి మార్ఫింగ్ ఫొటోలు అంటూ షాకివ్వ‌డం.. ఇని పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించ‌డంతో బాలీవుడ్ ఓ ర‌ణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫొటో షూట్ పై పెద్ద దుమార‌మే చెల‌రేగింది. ఆ తరువాత ర‌న్ వీర్ న్యూడ్ ఫొటోల వివాదం స‌ద్దుమ‌నిగింది.

తాజాగా దీపికా ప‌దుకునే ఇదే త‌ర‌హా వివాదంలో చిక్కుకోవ‌డంతో హ‌జ్బెండ్ న్యూడ్‌.. వైఫ్ సెమీ న్యూడ్ అంటూ నెటిజ‌న్ లు ఏకి పారేస్తున్నారు. షారుఖ్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న బాలీవుడ్ మూవీ 'ప‌ఠాన్‌'. 2023 జ‌న‌వ‌రి 23న విడుద‌ల కానున్న ఈ మూవీలో దీపిక ప‌దుకోన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. సిద్దార్ధ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ ని తాజా చిత్ర‌ బృందం ప్రారంభించింది. ఇందులో భాగంగా 'భేష‌ర‌మ్ రంగ్‌' అంటూ బీచ్‌సాంగ్ ని రిలీజ్ చేసింది.

ఈ పాట‌లో హీయిన్ దీపికా ప‌దుకోన్ రెచ్చిపోయి అందాల విందు చేసింది. ఇంత వ‌ర‌కు ఈ రేంజ్‌లో టూ పీస్ బికినీల్లో క‌నిపించ‌ని దీపిక ఈ పాట‌లో ఈ స్థాయిలో రెచ్చిపోవ‌డం.. కాషాయ బికినీ ధ‌రించి థై షో చేయ‌డం.. హ‌ద్దులు దాటి ప‌పెమీ న్యూడ్ అనిపించేలా గ్లామ‌ర్ షో చేయ‌డంతో నెటిజ‌న్ లు దీపిక‌ని నెట్టింట ఏకి పారేస్తున్నారు.

మ‌రీ ఇంత‌గా హ‌ద్దులు దాటి అంగాగ ప్ర‌ద‌ర్శ‌న అవ‌స‌ర‌మా? అంటూ మండిప‌డుతున్నారు. 'ప‌ఠాన్‌' ని బాయ్‌కాట్ చేయాల్సిందే అంటూ బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. ఇది ప్ర‌స్తుతం నెట్టింట ట్రెండ్ గా మారి వైర‌ల్ అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.