Begin typing your search above and press return to search.

వైరల్‌ : బికినీ పై యాక్షన్‌ సీన్స్‌.. సోషల్‌ మీడియా ట్రోల్స్

By:  Tupaki Desk   |   3 Nov 2022 8:30 AM GMT
వైరల్‌ : బికినీ పై యాక్షన్‌ సీన్స్‌.. సోషల్‌ మీడియా ట్రోల్స్
X
షారుఖ్‌ ఖాన్‌ సుదీర్ఘ కాలం తర్వాత బాక్సాఫీస్ వద్దకు పఠాన్ సినిమా తో రాబోతున్న విషయం తెల్సిందే. జీరో సినిమా తర్వాత షారుఖ్‌ ఖాన్‌ సినిమా ఇప్పటి వరకు రాలేదు. ఆయన స్టార్‌ డమ్‌ ఆయన క్రేజ్ నేపథ్యంలో పఠాన్ సినిమా భారీ అంచనాల నడుమ పక్కా కమర్షియల్‌ గా రూపొందినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఈ సినిమా లో హీరోయిన్‌ గా దీపికా పదుకొనే నటించిన విషయం తెల్సిందే. ఆ మధ్య విడుదల అయిన పాటలో దీపికా బికినీ లో సందడి చేసిన విషయం తెల్సిందే. తాజాగా విడుదల అయిన టీజర్ లో దీపికా పదుకొనే బికినీ లో యాక్షన్‌ సన్నివేశాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

పాటలో బికినీ పర్వాలేదు కానీ యాక్షన్‌ సన్నివేశాల్లో కూడా బికినీ అవసరమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీపికా పదుకొనే బికినీ ట్రీట్ కోసం అయినా పఠాన్ సినిమాను చూడాలి అంటూ చాలా మంది ఆసక్తిగా ఉన్నారు అంటూ బాలీవుడ్ మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

షారుఖ్‌ ఖాన్ కి ఉన్న స్టార్‌ డమ్‌ నేపథ్యంలో పఠాన్ సినిమా మినిమం టాక్ దక్కించుకున్నా కూడా తప్పకుండా మంచి వసూళ్లను దక్కించుకుంటుందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇక షారుఖ్ స్టార్‌ డమ్‌ కి దీపికా యొక్క బికినీ అదనపు ఆకర్షణగా హంగు గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

పెళ్లి అయిన తర్వాత కూడా దీపికా పదుకొనే అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గలేదు. పై పెచ్చు ఆ ముద్దుగుమ్మ అందాల విందు మరింతగా చేస్తుంది అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్‌ తో ప్రాజెక్ట్‌ కే సినిమాలో దీపికా పదుకునే నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రాజెక్ట్‌ కే లో దీపికా ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరి లో ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.