Begin typing your search above and press return to search.

లిప్ లాక్ ఇచ్చిందని మరీ ఇంత దారుణంగా ట్రోల్ చేయాలా?

By:  Tupaki Desk   |   11 Jan 2022 11:30 AM GMT
లిప్ లాక్ ఇచ్చిందని మరీ ఇంత దారుణంగా ట్రోల్ చేయాలా?
X
క్యూట్ గా కనిపిస్తూ.. తన ఎక్స్ ప్రెషన్స్ తో అందరిని ఆకట్టుకునేలా చేస్తుంది అనుపమ పరమేశ్వరన్. ఆమె ఓకే చేసే పాత్రలన్ని వంక పెట్టే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతుంది. మరేం అయ్యిందో కానీ.. తాజాగా ఆమె నటించిన రౌడీబాయిస్ లో హీరోకు లిప్ లాక్ చేయటంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగా అడ్డదిడ్డమైన వాదనను వినిపిస్తూ.. ఆమెను తెగ ట్రోల్ చేసేస్తున్నారు.

అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు సోదరుడు కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం చేస్తూ.. రౌడీ బాయిస్ ను నిర్మించారు. సంక్రాంతి రేసులో వచ్చిన ఈ మూవీలో.. అనుపమ పరమేశ్వర్ ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా మారారు. ఇప్పటివరకు తనకున్న ఇమేజ్ కు భిన్నంగా ఈ సినిమాలో అమ్మడు చెలరేగిపోయినట్లుగా చెబుతున్నారు. ఇప్పటి వరకు ఏ హీరోతో లిక్ లాక్ సీన్లో నటించని అనుపమ.. ఈ మూవీలో కుర్ర హీరోతో లిప్ లాక్ చేసిన వైనాన్ని తిట్టి పోస్తున్నారు.

ఈ సినిమాకు హైప్ తీసుకురావటంలో భాగంగా ఈ సినిమాలో హీరో.. హీరోయిన్ల మధ్య భారీగానే లిప్ లాక్ సీన్లు పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లోనూ కిస్ సీన్ చూపించేశారు. దీనిపై ఆమె అభిమానులతో పాటు.. నెటిజన్లు అనుపమను ఒక ఆట ఆడుకుంటున్నారు.

నీ కంటూ సొంత ఇమేజ్ లేదా? ఎంత రెమ్యునరేషన్ ఇస్తే మాత్రం.. కొత్త కుర్రాళ్లకు లిప్ లాక్ ఇచ్చేస్తావా? అని ప్రశ్నిస్తే.. కిస్ సీన్ చేయటానికి ఒక స్థాయి ఉండాలి. ఎంత అగ్ర నిర్మాత కుటుంబానికి చెందిన వాడైతే మాత్రం.. రెమ్యునరేషన్ కోసం ఇంతలా దిగజారాలా? అంటూ తిట్టి పోస్తున్నారు. ఇక్కడితో ఆగని వారు మరో స్థాయికి వెళుతూ.. తమ హీరోతో చేసే సినిమాలో కూడా తప్పనిసరిగా లిప్ లాక్ చేయాలంటూ అడ్డదిడ్డమైన వాదనల్ని తీసుకొస్తున్నారు.

ఇదంతా చూసినప్పుడు.. హీరో.. హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సీన్ అన్నది సీన్ డిమాండ్ చేసే దానికి తగ్గట్లు ఉంటుందే తప్పించి.. ఏదోఒక సీన్లో లిప్ లాక్ సీన్ ను అతికించేస్తే.. ఎబ్బెట్టుగా ఉంటుంది. ఈ విషయాన్ని అభిమానులు ఎలా మిస్ అవుతున్నారన్నది పాయింట్. అయినా.. పెద్ద హీరోతో అయితే లిప్ లాక్ చేయొచ్చని.. కొత్త హీరోతో చేయకూడదన్న ఈ దరిద్రపుగొట్టు కాన్సెప్టులు ఏమిటో ఒక పట్టాన అర్థం కాదని చెప్పాలి.