Begin typing your search above and press return to search.

'సీత' పై ట్రోల్స్.. బాయ్ కాట్ చేయాలంటూ నేషనల్ వైడ్ ట్రెండ్..!

By:  Tupaki Desk   |   12 Jun 2021 10:00 PM IST
సీత పై ట్రోల్స్.. బాయ్ కాట్ చేయాలంటూ నేషనల్ వైడ్ ట్రెండ్..!
X
'బాహుబలి' రచయిత విజయేంద్ర ప్రసాద్ రామాయణం ఆధారంగా ''సీత'' అనే కథ రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. అలౌకిక్‌ దేశాయి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని హ్యూమన్‌ బీయింగ్‌ స్టూడియో ప్రొడక్షన్స్ సంస్థ రూపొందించనుంది. ఇప్పటి వరకు వచ్చిన రామాయణం సినిమాల కంటే ప్రత్యేకంగా.. సీత కోణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. ఇందులో సీత పాత్ర కోసం ఆలియా భ‌ట్ మరియు క‌రీనా క‌పూర్ ఖాన్ లను సంప్రదిస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే లేటెస్టుగా చివరకు కరీనా నే ఫైనలైజ్ చేసారని.. ఇందుకుగాను ఆమెకు రూ.12 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని చెబుతున్నారు.

గత రెండు రోజులుగా సీత పాత్రలో కరీనా కపూర్ నటించనుందనే వార్త మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో సీత రోల్ లో నటించే అర్హత ఆమెకు లేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకా కరీనా ను సీత పాత్ర కోసం తీసుకున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఆమె ఈ చిత్రంలో నటించడానికి వీల్లేదంటూ ట్విట్టర్ వేదికగా ఉద్యమిస్తున్నారు. 'బాయ్‌ కాట్ కరీనా ఖాన్' అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు.

హిందువులకు పరమ పవిత్రమైన సీత పాత్రలో ఒక ముస్లిం వ్యక్తి భార్య నటించడం ఆమోదయోగ్యం కాదని కామెంట్స్ పెడుతున్నారు. సూర్పణఖ క్యారక్టర్ లో అయితే కరీనా సెట్ అవుతుందని ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఆమె నటించిన పలు సినిమాల్లో సిగరెట్ తాగుతున్న ఫోటోలను షేర్ చేస్తూ.. సీత పాత్రని ఈమెతో ఎలా చేపిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సపోర్టర్స్ కూడా పెద్ద ఎత్తున నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకముందు కరీనా భర్త సైఫ్ అలీఖాన్ 'ఆదిపురుష్' విషయంలో ఇలానే నెగెటివిటీ ఎదుర్కొన్నారు. అందులో రావణుడి పాత్ర పోషిస్తున్న సైఫ్.. లంకాధిపతి కి సానుకూల వ్యాఖ్యలు చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు క్షమాపణలు చెప్పి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఈ క్రమంలో ఇప్పుడు సీత పాత్రలో అతని భార్య నటించకూడదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. 'సీత' రోల్ లో ఆమె నటిస్తుందనే వార్తలు వస్తేనే ఈ రేంజ్ లో ఉంటే.. కరీనా ను ఎంపిక చేసారని అఫీసియల్ నోట్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో!