Begin typing your search above and press return to search.
హృతిక్ జోమాటో యాడ్ పై సోషల్ మీడియాలో విమర్శలు
By: Tupaki Desk | 28 Aug 2021 11:01 AM ISTఏదో చేద్దామని యాడ్ రూపొందించింది.. కానీ ఏదో అయ్యింది. ఇప్పుడు ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జోమాటో అడ్డంగా బుక్కైంది. విమర్శల పాలవుతోంది. ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తాజాగా హృతిక్ రోషన్ మరియు కత్రినా కైఫ్ నటించిన తాజా ప్రకటనలను రిలీజ్ చేసింది. ఆ ప్రకటనల తర్వాత ఇబ్బందుల్లో పడింది.
ఈ ప్రకటన చూస్తే జోమాటో డెలివరీ బాయ్ అగ్రహీరో హృతిక్ రోషన్ చేసిన ఆర్డర్ ను భారీ వర్షం ఉన్నప్పటికీ డెలివరీ చేస్తున్నట్లు వీడియోలో చూపించారు. అతడిని ‘జాడూ’ అని పిలుస్తూ హృతిక్ అన్ని వాతావరణ పరిస్థితులలోనూ తన పనిని పూర్తి చేసినందుకు ప్రశంసించాడు. తరువాత హృతిక్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌తో సెల్ఫీ తీసుకోవడానికి ఆఫర్ చేస్తాడు. తన ఫోన్ తీసుకోవడానికి ఇంటి లోపలికి వెళ్లాడు.
అప్పుడే ఆ డెలివరీ బాయ్ తన మొబైల్‌లో మరో ఆర్డర్ కోసం నోటిఫికేషన్ పొందుతాడు. అతను తన తదుపరి డెలివరీ చేయడానికి సమయం లేదని భావించి హృతిక్ తో సెల్ఫీని కూడా తీసుకోకుండా వర్షంలో బయలుదేరుతాడు. ఇక్కడ జోమాటో చెప్పదలుచుకుంది ఏంటంటే.. తాము ఫుడ్ డెలివరీని వాతావరణం.. అనేక ఇతర కారణాలతో సంబంధం లేకుండా సమయానికి పంపిణీ చేస్తామని చాటడం..
అయితే ఈ ప్రకటన కొన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోలేదు. జొమాటో ఇప్పటికే సిబ్బందితో వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలను ఎదుర్కొంటోంది..ఈ ప్రకటన ద్వారా అవి మరింత ఎక్కువయ్యాయి. కంపెనీ యాడ్ పై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
నెటిజన్లు ప్రస్తుతం జోమాటోను ట్రోల్ చేస్తున్నారు. జోమాటో తన ప్రకటనల కోసం బాలీవుడ్ ప్రముఖులకు భారీగా చెల్లిస్తూ.. డెలివరీ చేసే బాయ్ లపై మాత్రం తక్కువ పెట్టుబడి పెడుతోందని ఆరోపిస్తోంది. ఉద్యోగుల శ్రేయస్సును గుర్తించి ఎక్కువ దృష్టి పెట్టాలని కోరుతున్నారు. చెడు వాతావరణ పరిస్థితుల్లో పనిచేసినందుకు వారికి తగిన పరిహారం అందించాలని వారు కామెంట్ చేస్తున్నారు. కత్రినా కైఫ్‌తో కూడా ఇలాంటి యాడ్ చిత్రీకరించారు. దానిపై కూడా నెటిజన్లు ఇలాగే స్పందిస్తున్నారు.
జొమాటో డెలివరీ బాయ్ లు కొంతకాలంగా పోరాడుతున్నారు. తమకు ఉద్యోగ అభద్రత ఉందని, వేరియబుల్ వేతనం, తక్కువ మూల వేతనం, సుదూర రిటర్న్ బోనస్ లేకపోవడం.. కి.మీలోపు చెల్లింపు లేకపోవడంపై నిరసనగా సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేస్తున్నారు. .