Begin typing your search above and press return to search.

క్రికెట్‌ కోసం అంత దూరం అవసరమా.. హీరోయిన్ పై ట్రోల్స్‌

By:  Tupaki Desk   |   4 Aug 2022 1:30 PM GMT
క్రికెట్‌ కోసం అంత దూరం అవసరమా.. హీరోయిన్ పై ట్రోల్స్‌
X
అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ లో టీం ఇండియా స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుదీర్ఘ కాలం పాటు నెం.1 దేశంగా క్రికెట్ ని శాసించిన ఇండియా కంటే క్రికెట్ ను ఇంగ్లాండ్‌ లో బాగా నేర్పిస్తారని హీరోయిన్ అనుష్క శర్మ అక్కడకు వెళ్లడం పై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ఒక సినిమా కోసం అనుష్క క్రికెట్ నేర్చుకోవడం కోసం ఇంగ్లాండ్‌ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

'చక్దా ఎక్స్‌ ప్రెస్‌' అనే సినిమాలో అనుష్క మహిళ టీమ్‌ ఇండియా క్రికెటర్‌ ఝులన్ గోస్వామి గా కనిపించబోతున్న విషయం తెల్సిందే. కింది స్థాయి నుండి ఝులన్‌ గోస్వామి క్రికెటర్ గా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా 'చక్దా ఎక్స్‌ ప్రెస్‌'. ఈ సినిమా లో అనుష్క లుక్ ఇప్పటికే విడుదల అయ్యి మంచి ప్రశంసలు దక్కించుకుంది.

మాజీ టీం ఇండియా కెప్టెన్ అయిన ఝులన్‌ గోస్వామి జీవిత చరిత్ర ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అయ్యింది.

ఎట్టకేలకు రెగ్యులర్‌ షూటింగ్‌ కు రెడీ అయ్యారు. సినిమా కోసం బౌలింగ్ ను ప్రాక్టీస్ చేస్తున్న అనుష్క మరింత ప్రావిణ్యం కోసం ఏకంగా ఇంగ్లాండ్ కి వెళ్లిందట.

ఇంగ్లాండ్‌ లో అనుష్క దాదాపు మూడు నాలుగు వారాల పాటు ట్రైనింగ్‌ తీసుకోబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు క్రికెట్‌ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి.

వాటిల్లో ఎక్కువ శాతం కమర్షియల్ గా విజయాలను సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో అనుష్క ఈ సినిమా కోసం కాస్త ఎక్కువ కష్టం పడుతున్నట్లుగా ఆమె సన్నిహితులు మరియు బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు.