Begin typing your search above and press return to search.

హీరోయిన్ మసాలా ఎంట్రీకి విమర్శలు

By:  Tupaki Desk   |   12 Jan 2019 11:32 AM IST
హీరోయిన్ మసాలా ఎంట్రీకి విమర్శలు
X
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో వెంటనే చరణ్ సినిమా 'వినయ విధేయ రామ' లో అవకాశం వచ్చింది. బోయపాటి-చరణ్ కాంబినేషన్ పై అంచనాలు ఉండడంతో ఈ సినిమా విజయంపై కియారా కూడా నమ్మకంగా ఉంది. కానీ విడుదలైన తర్వాత రెస్పాన్స్ మాత్రం అంత పాజిటివ్ గా అయితే లేదు.

ఇదిలా ఉంటే 'వినయ విధేయ రామ' లో కియారా ఎంట్రీ సీన్ హాట్ టాపిక్ అయింది. దర్శకుడు హీరోయిన్ ను క్లీవేజ్ షోతో పరిచయం చేసిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంట్రో సీన్ కోసం బోయపాటి మరో సీన్ ఎంచుకొని ఉండాల్సిందని అంటున్నారు. కమర్షియల్ సినిమాల్లో ఇలాంటి సీన్లు కామనే గానీ కొత్త తరం ఫిలిం మేకర్లు రావడంతో ఈ పాతకాలం సీన్లు ఈమధ్య తగ్గిపోయాయి. కానీ బోయపాటి తీసింది పక్కా మాస్ ఫార్మాట్ సినిమా కాబట్టి ఓల్డ్ టెంప్లేట్ ను బ్లైండ్ గా ఫాలో అయ్యాడు. ఒకరకంగా అయన అనుకున్నట్టే కియారా ఎంట్రీ సీన్ వచ్చినప్పుడు థియేటర్లో ఈలలు అరుపులు వినిపిస్తున్నాయి.

అయినా కియారాకు అందాలు ధారపోయడం కొత్తకాదు. 'లస్ట్ స్టోరీస్' వెబ్ సీరీస్ కనుక చూస్తే విమర్శలు చేసే ఈ నెటిజనుల నోళ్ళు మూతపడడం ఖాయం. బోయపాటి ఒక మాస్ మాస్టర్ పీస్ తీసేందుకు ప్రయత్నించాడు. క్లీవేజ్ షోలు.. తలలు నరకడాలు గద్దలు ఆ తలలను పట్టుకెళ్ళే సీన్లు ఉండొద్దంటే ఎలా.. అర్థం చేసుకోరూ!