Begin typing your search above and press return to search.

నితిన్ సినిమా మెడకు ఆ వివాదం

By:  Tupaki Desk   |   27 July 2022 8:22 AM GMT
నితిన్ సినిమా మెడకు ఆ వివాదం
X
యువ కథానాయకుడు నితిన్ ప్రధాన పాత్ర పోషించిన ‘మాచర్ల నియోజకవర్గం’ మాస్‌లో మంచి క్రేజే తెచ్చుకుంది. ఈ సినిమా ప్రోమోలన్నింట్లో మాస్, యాక్షన్ అంశాలు బాగా దట్టించడం.. ‘రారా రెడ్డి’ సహా ఇప్పటిదాకా రిలీజ్ చేసిన పాటలన్నీ కూడా ఆకట్టుకోవడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి.

అంతా బాగుందని ఆగస్టు 12న విడుదల కోసం నితిన్ అండ్ టీం జోరుగా సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో.. ఊహించని వివాదం ఒకటి ఈ సినిమాను చుట్టుముట్టింది. #Banmacharlaniyojakavargam అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యే వరకు పరిస్థితి వెళ్లింది. ఇందుక్కారణం.. ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అవుతున్న ఎడిటర్ శేఖర్ ట్విట్టర్ వేదికగా చూపించిన కుల, రాజకీయ అభిమానమే. పూరి జగన్నాథ్ సినిమాలు చాలా వాటికి ఎడిటర్‌గా పని చేయడం ద్వారా శేఖర్ పేరు ఇండస్ట్రీలో సుపరిచితమే. ఐతే దర్శకుడిగా పరిచయం అయ్యే క్రమంలో అతను సామాన్య జనానికి కూడా తెలిశాడు.

ఈ క్రమంలో శేఖర్ పేరుతో ఉన్న ఒక ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలిచిన సందర్భంగా అతను కమ్మ, కాపు కులస్థులను బూతులు తిడుతూ ఈ పోస్టు పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఐతే అది ఫేక్ ట్వీట్ అనే విషయాన్ని ఆధారాలతో నిరూపించే ప్రయత్నం చేశాడు శేఖర్.

హీరో నితిన్ కూడా అతడికి మద్దతుగా నిలిచాడు. కానీ ఆ ట్వీట్ ఫేక్ కావచ్చు కానీ.. జగన్‌ను పొగొడుతూ.. చంద్రబాబును విమర్శిస్తూ కాస్త లో లెవెల్‌లో ఉన్న ట్వీట్లు అయితే చాలానే ఉన్నాయి శేఖర్ అకౌంట్లో. ఒక ఫిలిం సెలబ్రెటీ నుంచి అలాంటి ట్వీట్లు పడతాయని ఎవ్వరూ ఊహించరు.

ఇప్పుడు దర్శకుడిగా ఒక స్థాయి అందుకుంటున్నపుడైనా శేఖర్ ఆ ట్వీట్లు డెలీట్ చేయాల్సిందేమో. కానీ అవన్నీ ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. దీంతో జగన్‌ అంటే గిట్టని వాళ్లంతా ఇప్పుడు శేఖర్‌ను టార్గెట్ చేసుకున్నారు. పాత ట్వీట్లను తవ్వి అతను దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమాను టార్గెట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఫేక్ ట్వీట్ కూడా పరిస్థితికి ఆజ్యం పోసింది. అది ఫేక్ ట్వీట్ అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నా.. ఇతర ట్వీట్లను చూపించి అతణ్ని, తన సినిమాను టార్గెట్ చేస్తున్నారు. పైగా ‘మాచర్ల నియోజకవర్గం’లో హీరో, న

ిర్మాతలు రెడ్లే కావడం.. సినిమాలో హీరో పేరు రెడ్డే అవడం, ఇందులో ‘రా రా రెడ్డి’ అంటూ ఒక పాట కూడా ఉండడంతో ఇదేం కుల పిచ్చి.. రెడ్లు తప్ప ఇంకెవరూ సినిమా చూడాల్సిన అవసరం లేదా అంటూ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాను మిగతా కులస్థులంతా బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. అసలే బాక్సాఫీస్ పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో ఈ నెగెటివిటీ ‘మాచర్ల నియోజకవర్గం’కు చేటు చేసేలా కనిపిస్తోంది.