Begin typing your search above and press return to search.

ఛోటా కే నాయుడు పాత వీడియోలు వైరల్

By:  Tupaki Desk   |   13 Nov 2018 11:21 AM GMT
ఛోటా కే నాయుడు పాత వీడియోలు వైరల్
X
మామూలుగా సోషల్ మీడియాలో సినిమా చర్చలన్నీ హీరోలు.. దర్శకులు.. హీరోయిన్ల చుట్టూ తిరుగుతుంటాయి. టెక్నీషియన్లు ఎప్పుడో కానీ వార్తల్లోకి రారు. కానీ ఇప్పుడు కెమెరామన్ ఛోటా కే నాయుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోతున్నాడు. నిన్నట్నుంచి ఆయన గురించే డిస్కషన్లన్నీ. ‘కవచం’ టీజర్ లాంచ్ కార్యక్రమంలో కాజల్ మాట్లాడుతూ తన గురించి ప్రస్తావించగానే.. అతను దగ్గరికెళ్లి ఆమెకు ముద్దిచ్చేయడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. కాజల్ అభిమానులే కాదు.. సామాన్యులు సైతం అతడిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. మామూలు రోజుల్లో అయినా దీన్ని లైట్ తీసుకునేవాళ్లేమో కానీ.. ఇప్పుడు ‘మీ టూ’ మూమెంట్ ఉద్ధృతంగా నడుస్తున్న నేపథ్యంలో ఛోటా కే నాయుడు మీద విమర్శల దాడి పెరుగుతోంది.

ఈ క్రమంలోనే ఛోటాకు సంబంధించిన పాత వీడియోలు బయటికి తీస్తున్నాడు. ఛోటా అమ్మాయిల విషయంలో చేసిన అతికి సంబంధించిన ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒక ఆడియో వేడుకలో నిత్యా మీనన్ గురించి ఛోటా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. వేదిక మీది నుంచి ఆమెకు ఐలవ్యూ చెప్పడం.. ఆమెను స్వీట్ హార్ట్ అని పేర్కొనడం.. తన భార్య తర్వాత బంగారం అని పిలిచేది నిత్యనే అనడం ఈ వీడియోలో చూడొచ్చు. మరోవైపు ఇంకో ఇంటర్వ్యూలో నిత్య గురించి మాట్లాడిన వీడియో కూడా వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’లో నిత్యను కథానాయికగా పెట్టుకుందామని అంటే తాను ఆమెతో మాట్లాడతానంటూ... ‘ఐమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ యు’ అంటూ తన పేరుతో మెసేజ్ పెడితే రెస్పాన్స్ ఇవ్వలేదని ఛోటా అన్నాడు. తర్వాత ‘రుద్రమదేవి’ షూటింగ్ సందర్భంగా ఆమెను చూసి తాను మాట్లాడకుండా సైలెంటుగా ఉంటే.. గుణశేఖర్ వచ్చి హీరోయిన్లను చూస్తే నువ్వు వదలవుగా అని తనతో అన్న విషయాన్ని గుర్తు చేశాడు. మరో ఇంటర్వ్యూలో సైతం ఛోటా రొమాంటిక్ యాంగిల్ బయటపడింది. దాని వీడియో కూడా చక్కర్లు కొడుతోంది. దీన్ని బట్టి హీరోయిన్ల విషయంలో ఛోటా మనస్తత్వం ఎలాంటిదో రుజువవుతోందంటూ అతడిని ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు.