Begin typing your search above and press return to search.

ట్రోల‌ర్ పై మింగుడుప‌డ‌ని పంచ్ వేసిన స్టార్ హీరో సిస్ట‌ర్

By:  Tupaki Desk   |   14 April 2021 12:30 AM GMT
ట్రోల‌ర్ పై మింగుడుప‌డ‌ని పంచ్ వేసిన స్టార్ హీరో సిస్ట‌ర్
X
టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ తన బికినీ ఫోటోని విమర్శించినందుకు నెటిజ‌న్ పై పంచ్ వేశారు. ఒక నెటిజన్ తన సోదరుడితో పోల్చి ఆమెను అవమానించడానికి ప్రయత్నించినప్పుడు ఆమె కూల్ యాటిట్యూడ్ ని కోల్పోయారు.

ఓ నెటిజన్ కృష్ణ ష్రాఫ్ ను తన సోదరుడు టైగర్ ష్రాఫ్ తో పోలుస్తూ అవ‌మానించాడు. ``మ్యాడం మీ బ్ర‌ద‌ర్ టైగర్ ఎంత బాగుంటారో మీరు అంత బేకార్... ఇలాంటి ఫోటోలు షేర్ చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా ? మీ తల్లిదండ్రులు ఈ ఫోటోలు చూడలేదా ?`` అంటూ కామెంట్ చేశాడు. దీంతో కృష్ణ సదరు నెటిజన్ పై విరుచుకుప‌డింది.``నా విష‌యంలో మీకున్న కన్సర్న్ కు చాలా థాంక్స్ సర్... బట్ యూ కెన్ ***... ఎవరైనా ఇతని కోసం నా సమాధానాన్ని ట్రాన్స్ లేట్ చేయండి`` అంటూ గ‌ట్టిగానే రిప్లై ఇచ్చింది.