Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: మాయావి క్యూలో ఆ నలుగురు
By: Tupaki Desk | 26 Jun 2020 10:15 AM ISTఒకదాని వెంట ఒకటిగా ప్రాజెక్టులు ఖాయం చేసుకుని ఐదారేళ్ల పాటు ఖాళీ అన్నదే లేకుండా ప్లాన్ చేస్తున్నాడు మాయావి త్రివిక్రమ్. మహమ్మారీ స్వీయనిర్భంధ సమయాన్ని ఎవరు ఎలా వినియోగించుకున్నారు? అన్నది అటుంచితే త్రివిక్రమ్ మాత్రం పక్కాగా సద్వినియోగం చేసుకుంటున్నాడనే చెప్పాలి.
ఇప్పటికే ఎన్టీఆర్ కోసం స్క్రిప్టు రెడీ. తారక్ సెట్స్ కి వచ్చేందుకు సిద్ధంగా ఉంటే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బృందం సర్వసన్నాహకాల్లో ఉంది. ఈ స్క్రిప్టుపై పని చేస్తుండగానే మరోవైపు వెంకీ-నాని స్క్రిప్టును రెడీ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన పనుల్ని వేగవంతం చేశాడట.
ఆ ఇద్దరితోనేనా? అంటే అటుపైనా మరో ఇద్దరు హీరోల్ని లైనప్ చేసుకుంటున్నాడు. అందులో టాప్ హీరోలు మహేష్.. పవన్ కల్యాణ్ ఉన్నారు. ఆ ఇద్దరూ త్రివిక్రమ్ కి ఎంతో సన్నిహితులు. ఒకరి తర్వాత ఒకరు రెడీగా ఉన్నారట. స్క్రిప్టుల్ని పక్కాగా తీర్చిదిద్ది వినిపించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ సిద్ధం చేశారని తెలిసింది.
వీళ్లందరితో పాటు రామ్ చరణ్ .. అల్లు అర్జున్ సైతం ఇప్పటికే త్రివిక్రమ్ తో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆ క్రమంలోనే నలుగురైదుగురు హీరోలు త్రివిక్రమ్ క్యూలో ఉన్నారన్న క్లారిటీ అయితే ఇప్పటికే వచ్చేసింది.
ముందుగా తారక్ తో పని పూర్తవుతుంది. ఆ తర్వాత లైనప్ లోకి ఎవరు ముందు వస్తారు? ఎవరు వెనక్కి వెళతారు? అన్నది తేల్తుందన్నమాట. ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణను వేగంగా పూర్తి చేసుకుని త్రివిక్రమ్ కి అందుబాటులోకి రావాలని తారక్ ఆత్రంగానే ఉన్నాడు.