Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ తదుపరి సినిమా లాక్ అయ్యింది

By:  Tupaki Desk   |   5 July 2018 9:49 AM IST
త్రివిక్రమ్ తదుపరి సినిమా లాక్ అయ్యింది
X
ఒక సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా.. ఆయన తదుపరి సినిమా కోసం అందరూ చాలా ఆసక్తిగా వేచి చూస్తుంటారు. ఆయనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. కొత్త కథలను రాస్తాడని కాదు కాని.. పాత మాటలను కూడా కొత్తగా మనకు వినసొంపైన విధంగా మనస్సుకు హత్తుకునే మీటర్లో కొత్తగా చెబుతాడని ఆయన సినిమాలంటే చాలామందికి ప్రాణం. ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఈయన తదుపరి సినిమా చేస్తున్నాడు.

అజ్ఞాతవాసి సినిమా భారీ డిజాష్టర్ అయ్యాక.. తను కూడా అజ్ఞాతవాసంలోకే వెళిపోయి.. చివరకు ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమాను ప్రకటించాడు. తన పద్దతికి వ్యతిరేకంగా సినిమా ఇలా మొదలెట్టాడో లేదో అలా టైటిల్ ప్రకటించేశాడు. ఇప్పుడు ఈ సినిమా పూర్తికవాస్తోంది. అక్టోబర్ లో రిలీజ్ కాబట్టి మేకింగ్ పేస్ పెంచి పని చకచకా కానిస్తున్నాడట. ఈలోపే ఆ తరువాత చేయబోయే సినిమాకు కూడా స్కెచ్ రెడీ చేశాడు త్రివిక్రమ్. ఇప్పటికే జులాయి .. సన్నాఫ్‌ సత్యమూర్తి అంటూ అల్లు అర్జున్ తో రెండు సినిమాలు చేశాడు మాంత్రికుడు. ఇప్పుడు మూడో సినిమా కూడా అంతా రెడీ అయిపోయిందట.

ఆల్రెడీ చూచాయిగా బన్నీకి లైన్ చెప్పడం.. ఆ లైన్ స్టయిలిష్‌ స్టార్ కు నచ్చడం.. అలాగే డివివి దానయ్య నిర్మాతగా ముందుకు రావడంతో.. ఈ ప్రాజెక్ట్ లాక్ అయ్యిందని అంటున్నారు. బన్నీ మరోవైపు నల్లమలుపు బుజ్జి ప్రొడక్షన్లో 'మనం' ఫేం విక్రమ్ కుమార్ తో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.