Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ కోసం ఆ హీరోయిన్ కూడా ఫిక్స్

By:  Tupaki Desk   |   20 May 2019 4:14 PM IST
అల్లు అర్జున్ కోసం ఆ హీరోయిన్ కూడా ఫిక్స్
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈమధ్యే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ నివేద థామస్ కు ఆఫర్ వచ్చిందట. అయితే ఈ సినిమాలో నివేద హీరోయిన్ గా నటించడం లేదట.. బన్నీకి సిస్టర్ పాత్రలో నటిస్తోందని సమాచారం. సహజంగా హీరోయిన్లు సిస్టర్ పాత్రల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించరు. ఒకసారి అలాంటి పాత్రలు స్వీకరిస్తే ఇక హీరోయిన్ పాత్రలు రావని భయపడతారు. కానీ అలాంటి సంకోచాలేవీ లేకుండా బన్నీకి సోదరి పాత్రలో నటించేందుకు నివేద ఒప్పుకోవడం నిజంగా గొప్ప విషయమే.

ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'అలకనంద'.. 'నాన్న నేను' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారని టాక్ ఉంది. ఈ సినిమాలో బొమన్ ఇరాని.. టబు ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్.. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.