Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ సత్తా కనిపించనుందా

By:  Tupaki Desk   |   2 April 2018 12:40 PM IST
త్రివిక్రమ్ సత్తా కనిపించనుందా
X
రామ్ చరణ్ మూవీ రంగస్థలం హంగామా బాక్సాఫీస్ దగ్గర కొనసాగుతుండగానే.. మరో సినిమా రిలీజ్ కు రెడీ అయిపోయింది. మెగా పవర్ స్టార్ సత్తా చాటుతున్న సమయంలోనే పవర్ స్టార్ నిర్మాతగా రూపొందిన నితిన్ మూవీ ఛల్ మోహన్ రంగ థియేటర్లలోకి వచ్చేస్తోంది.

ఏప్రిల్ 5న విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన కథ కావడం.. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్.. ప్రోమోలలో వినిపిస్తున్న కామెడీ కంటెంట్ లో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుండడం గమనించాలి. చాలాకాలం తర్వాత త్రివిక్రమ్ పెన్ను నుంచి జాలువారిన ప్రేమకథా చిత్రంగా ఈ ఛల్ మోహన రంగను చెప్పవచ్చు. నిజానికి అ..ఆ.. తర్వాత నితిన్ తో ఈ చిత్రాన్ని కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే తెరకెక్కించాలని అనుకున్నారని.. కానీ ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారనే టాక్ ను.. నితిన్ కరెక్టే అని ఒప్పుకున్నాడు.

తన పెన్ను పవర్ ఏ మాత్రం తగ్గలేదని త్రివిక్రమ్ ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండగా.. ఈ సంగతి ఛల్ మోహన రంగతో తేలిపోతుందని అంటున్నారు. త్రివిక్రమ్ స్వయంగా డైలాగ్స్ రాయకపోయినా.. ఆయన టీం డెవలప్ చేసిన సబ్జెక్ట్ కావడం.. అందులోనూ లవ్ థీమ్ కావడంతో.. ఛల్ మోహన రంగపై ట్రేడ్ జనాలు ఆసక్తిగానే ఉన్నారు.