Begin typing your search above and press return to search.
చెయ్-శామ్ లతో త్రివిక్రమ్ రోమ్ కామ్
By: Tupaki Desk | 16 March 2017 12:37 PM ISTత్రివిక్రమ్ శ్రీనివాస్.. అక్కినేని నాగచైతన్యతో ఓ మూవీ చేయనున్నాడనే న్యూస్.. కొన్ని రోజులుగా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అప్ కమింగ్ ప్రాజెక్టులలో అత్యంత ఆసక్తి కలిగిస్తున్న మూవీస్ లో ఇది కూడా ఒకటి అని చెప్పాలి.
మరోవైపు.. తాజాగా ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ లో భాగంగా సమంత ఓ చల్లని కబురు చెప్పింది. తన కాబోయే భర్త చైతుతో వచ్చే ఏడాది ఓ సినిమా చేసే అవకాశాలున్నాయని తెలిపింది సమంత. పెళ్లయ్యాకే సినిమా చేస్తా అని చెప్పలేదు కానీ.. అమ్మడు చెప్పినదానికి అర్ధం అదే. త్రివిక్రమ్ తో చైతు మూవీ.. సమంతతో చైతు మూవీ.. ఈ రెండు వేర్వేరు కాదని.. రెండూ ఒకటే సినిమా అన్నది టాలీవుడ్ లేటెస్ట్ టాక్. సమంతతో వరుసగా సినిమాలు చేసి మంచి ఆఫర్స్ ఇచ్చిన త్రివిక్రమ్.. ఇప్పుడు చెయ్ - సమంతలతో రొమాంటిక్ కామెడీ సినిమా చేయనున్నాడట. పవన్ తో సినిమా పూర్తి కాగానే.. ఈ సబ్జెక్ట్ నే హ్యాండిల్ చేస్తాడట త్రివిక్రమ్.
ఇప్పటికి మూడు సార్లు కలిసి నటించారు చెయ్- సమంత. ఏం మాయ చేశావే.. మనం.. ఆటోనగర్ సూర్య చిత్రాల్లో వీళ్ల జంట సందడి. ఇప్పుడు నాలుగోసారి మాత్రం పెళ్లి చేసేసుకున్న తర్వాత కలిసి కనిపించబోతున్నారు చెయ్- శామ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/