Begin typing your search above and press return to search.
సెన్సేషనల్: త్రివిక్రమ్ డైరెక్షన్లో చిరు, పవన్
By: Tupaki Desk | 2 Feb 2017 5:26 PM ISTషాకంటే షాక్ కాదులే. అసలు మామూలుగా మెగా ఈవెంట్లలోనే అసలు మెగాస్టార్ చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ కలసి కనిపించట్లేదు అని అభిమానులు కొందరు ఫీలవుతుంటే.. ఇప్పుడు మాత్రం ప్రొడ్యూసర్ కమ్ ఎంపి అయిన టి.సుబ్బిరామిరెడ్డి ఒక కొత్త సినిమా ఎనౌన్స్ మెంట్ తో ప్రకంపనలు రేపేశారు.
ఖైదీ నెం 150 సినిమాను చూసిన తరువాత తాను తిరిగి సినిమాల్లోకి రావాలని ఎంపి సుబ్బిరామి రెడ్డి అనుకున్నారట. అది కూడానూ చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఒక సినిమాను రూపొందించాలని ఫిక్సయ్యారట. దానితో వెంటనే దర్శకుడిగా ఎవరైతే బాగుంటుంది అనుకుని.. త్రివిక్రమ్ కంటే ఎవ్వరూ బెటర్ కాదని ఫీలయ్యి.. వెంటనే అతన్ని సంప్రదించారట. ఈరోజు మరోసారి సుబ్బిరామి రెడ్డిని కలిసిన త్రివిక్రమ్.. కథను ఓకే చేయడంతో ఈ సినిమాను అశ్వినీదత్ తో కలసి ప్రొడ్యూస్ చేస్తున్నట్లు ప్రకటించారు సుబ్బిరామి రెడ్డి.
మొత్తానికి అస్సలు ఎవ్వరూ ఊహించని రీతిలో.. చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో కనిపిస్తున్నారంటే మాత్రం షాకింగ్ గానే ఉంది. ఇకపోతే ప్రస్తుతం కాటమరాయుడు క్లయిమ్యాక్స్ షూటింగులో పవన్ కళ్యాణ్ బిజీగా ఉంటే.. 151వ కథను వండించడంలో చిరంజీవి బిజీగా ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/