Begin typing your search above and press return to search.

పవన్-త్రివిక్రమ్.. న్యూక్లియర్ ఫిజిక్స్

By:  Tupaki Desk   |   14 April 2016 10:12 AM IST
పవన్-త్రివిక్రమ్.. న్యూక్లియర్ ఫిజిక్స్
X
పవన్ కళ్యాణ్ కు సినీ పరిశ్రమలో అత్యంత ఆప్తుడు ఎవరంటే మరో మాట లేకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు చెప్పేయొచ్చు. చాలా పరిమిత సంఖ్యలో స్నేహితుల్ని మెయింటైన్ చేసే పవన్.. తరచుగా కలిసే వ్యక్తుల్లో త్రివిక్రమ్ ఒకడు. ‘జల్సా’ సినిమాతో హీరో-దర్శకుడుగా ప్రయాణం మొదలుపెట్టి.. కొంత కాలానికే ఆప్త మిత్రులు అయిపోయారు పవన్-త్రివిక్రమ్. ఐతే తామిద్దరం కలిసి ఏం మాట్లాడుకుంటామో.. ఎలా ఉంటామో ఇద్దరూ కూడా ఎప్పుడూ చెప్పింది లేదు. త్రివిక్రమ్ అయినా దీని గురించి అప్పుడప్పుడూ హింట్లిస్తుంటాడు కానీ.. పవన్ మాత్రం మాట్లాడడు. ఐతే ఈ మధ్య తెగ ఇంటర్వ్యూలిచ్చేస్తున్న పవన్.. త్రివిక్రమ్ గురించి కూడా స్పందించాడు.

మీరిద్దరూ కలిస్తే ఏం మాట్లాడుకుంటారు.. ఏం చేస్తారు అని పవన్ ను అడిగితే.. ‘‘ఇద్దరు స్నేహితులు కాలేజ్ గోడ మీద కూర్చుని కాళ్లు ఊపుతూ ఏం మాట్లాడుకొంటారో.. మా ఇద్దరి మధ్య మాటలు కూడా అలాగే ఉంటాయి. ఐతే మేం సినిమాల గురించి మాట్లాడ్డం చాలా తక్కువ. ఫలానా సినిమా బాగుంది అంటే బాగుంది అని.. బాగోలేదంటే బాగోలేదని అనుకుంటాం. అంతవరకే. ఇక ఆ తర్వాత పానుగంటి గారి కథలు మొదలుకొని విశ్వనాథ సత్యనారాయణ గురించి.. న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ గురించి ఇలా ఏవేవో టాపిక్స్ మీదికి మా మాటలు వెళ్తుంటాయి. ఒకసారి త్రివిక్రమ్‌ నాకు న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ గురించి క్లాస్‌ తీసుకొన్నారు. ఆయన ఎమ్మెస్సీ స్టూడెంట్‌ కాబట్టి.. ఎక్స్‌ ప్లోజర్‌ ఎలా ఉంటుందో బోర్డుపై బొమ్మలేసి చూపిస్తున్నారు. నేను ఆసక్తిగా వింటూ కూర్చున్నా. మధ్యలో ఎవరో గదిలోకి వచ్చారు. మమ్మల్ని చూసి.. ఆశ్చర్యపోయి.. మీరు చేస్తోందేంటి? అసలు మీకు.. ఆ టాపిక్‌ కి ఏమైనా సంబంధముందా? అంటూ ఆశ్చర్యపోయారు. అలా ఉంటుంది మేమిద్దరం కలిస్తే’’ అని పవన్ చెప్పాడు.