Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ వదిలించుకుంటాడట!

By:  Tupaki Desk   |   30 Jan 2019 1:28 PM IST
అల్లు అర్జున్ వదిలించుకుంటాడట!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కొత్త సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ జోరుగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో లాంచ్ చేసి మార్చ్ లో రెగ్యులర్ షూట్ మొదలు పెడతారని సమాచారం.

ఇదిలా ఉంటే రీసెంట్ గా గురూజీ అల్లు అర్జున్ కు హీరో పాత్రకు సంబంధించిన నేరేషన్ ఇచ్చాడట. దీంతోపాటు ఆ పాత్రకు సూట్ అయ్యేలా స్లిమ్ గా మారాలని కూడా బన్నీకి సూచించాడట. గురూజీ తన చివరి చిత్రం 'అరవింద సమేత' కోసం జూనియర్ ఎన్టీఆర్ ను కూడా కష్టపెట్టిన సంగతి తెలిసిందే. 'జై లవకుశ' సమయంలో కాస్త బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ 'అరవింద సమేత' కోసం సిక్స్ ప్యాక్ అవతారం లోకి మారిపోయాడు. ఇప్పుడు బన్నీకి కూడా అదే కష్టం వచ్చింది. ఈమధ్య షూటింగులకు గ్యాప్ రావడంతో బన్నీ కాస్త వెయిట్ పెరిగాడు. అందుకే త్రివిక్రమ్ సినిమా ప్రారంభం అయ్యేలోపు స్లిమ్ గా మారాలని డిసైడ్ అయ్యాడట.

ఈ మిషన్ స్లిమ్ పాజిబుల్ లో భాగంగా బన్నీ ఇప్పటికే జిమ్ లో కసరత్తులు గట్రా మొదలుపెట్టాడని సమాచారం. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ - గీతా ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తారు. కియారా అద్వాని.. రష్మిక మందన్నలలో ఒకరిని హీరోయిన్ గా తీసుకునే ఆలోచనల్లో ఉన్నారట.