Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ టీజర్ వ్యూహం మహా సక్సెస్?
By: Tupaki Desk | 14 Jan 2020 10:36 AM ISTఅలా అనుకున్నంతనే ఇలా వెతుక్కుంటూ ఏమీ రాదు సక్సెస్. అందుకోసం చాలానే చేయాలి. ఒక్కోసారి ఎంత కష్టపడినా దరి చేరదు. ఊరించే విజయం కోసం కిందామీదా పడినా రాని విజయలక్ష్మీ మాత్రం కొన్నిసార్లు అనుకున్న దానికి మించిన ఫలితాన్ని ఇస్తోంది. ఇప్పుడు అలాంటి అనుభూతే అల టీంకు దక్కినట్లు చెబుతున్నారు. ఈ సినిమా ప్రాజెక్టు షురూ చేసిన నాటి నుంచి నమ్మకంగా ఉన్నప్పటికీ.. ఏదో తెలీని భయం వెంటాడేది.
సినిమా మీద పెరుగుతునన హైప్ ను.. సామజవరగమన పాట ఎక్కడికో తీసుకెళ్లిపోవటం.. ఆ పాట ఎలా ఉంటుంది? ఏ సందర్భంలో వస్తుందన్న ప్రశ్నల మీద చర్చ చాలానే జరిగింది. ఇన్ని అంచనాల మధ్య తొలిసారి తేడా కొట్టినట్లుగా అనిపించింది ఏమైనా ఉందంటే.. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్. అల టీజర్ విడుదలకు కాస్త ముందుగా సరిలేరు నీకెవ్వరు టీజర్ విడుదల కావటం.. బొమ్మ అదిరిపోద్దంటూ మహేశ్ గర్జిస్తే.. అందుకు భిన్నంగా సాఫ్ట్ గా.. కాస్తంత తేలిపోయినట్లుగా టీజర్ కట్ చేయటంతో సినిమా మీద కొత్త భయాలు అభిమానులకు పుట్టుకొచ్చాయి.
సినిమా ఎలా ఉన్నా.. దాన్ని పట్టించుకోకుండా అదరగొట్టేలా టీజర్ ను తయారు చేసే తీరుకు భిన్నమైన వ్యూహాన్ని త్రివిక్రమ్ ఎంచుకోవటం ఇప్పుడు వరంగా మారిందంటున్నారు. ఉన్నదంతా టీజర్ లో చూపించేసిన తర్వాత.. సినిమా చూసేటప్పుడు ఎగ్జైట్ మెంట్ ఏదో మిస్ అయ్యిందన్న భావన కలగటం ఖాయం. అదే సమయంలో టీజర్ అదిరేలా ఉంటే.. అందుకు తగ్గట్లే అంచనాలు భారీగా పెరిగిపోతుంటాయి.
సరిలేరు నీకెవ్వరు విషయంలో అలానే జరిగింది. ఇక.. అల విషయంలో అందుకు భిన్నమైన పరిస్థితి. సామజవరగమన పాటతోవచ్చిన హైప్ ను టీజర్ తో మరింత పెరిగేలా చూడకుండా.. తగ్గే వ్యూహాన్ని పాటించిన త్రివిక్రమ్.. సినిమా మీద భారీ అంచనాలతో థియేటర్లలోకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. అదే.. అల వైకుంఠపురము అద్భుత సక్సెస్ కు టానిక్ లా పని చేసిందన్న మాట వినిపిస్తోంది. టీజర్ లో గుట్టును అస్సలు బయటపెట్టకుండా సినిమా ఫస్ట్ సీన్ లోనే రివీల్ చేయటం ద్వారా.. కొత్త అనుభూతిని మిగిల్చారు. అదే అలను ఎక్కడికో తీసుకెళ్లేలా చేసిందని చెప్పక తప్పదు. అల టీజర్ విషయంలో అనవసరమైన హడావుడికి దూరంగా ఉండటం కలిసి వచ్చిందని చెప్పక తప్పదు.