Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ ఆ నవలను తీసుకోవడం లేదు
By: Tupaki Desk | 30 Jan 2018 3:10 PM ISTఅజ్ఞాతవాసి ఇచ్చిన స్ట్రోక్ కి బయట కనిపించడం మానేసిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే కొత్త సినిమా పనుల్లో తలమునకలై ఉన్నాడు. ఫెయిల్యూర్ ఏ దర్శకుడికి అయినా సహజం కాబట్టి దాని గురించే ఎక్కువ ఆలోచించి తల చెడగొట్టుకునే మనస్తత్వం కాదు కనక మాటల మాంత్రికుడు స్క్రిప్ట్ లో బిజీ అయిపోయాడు. ఇకపోతే ఈ కథను యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా రాసుకున్నాడని, అఆ సినిమా విషయంలో మీనా నవల కాపీ అంటూ రచ్చ జరిగింది కాబట్టి ఈ సారి జాగ్రత్త పడ్డాడని వార్తలు కూడా మొదలయ్యాయి. పైగా లార్గో వించ్ గురించి రేగిన వివాదం ఎంత లేదన్నా త్రివిక్రమ్ ఇమేజ్ కు కొంత డ్యామేజ్ చేసిన మాట వాస్తవం. కాని ఎన్టీఆర్ సినిమా విషయంలో వస్తున్న వార్తలన్నీ అబద్దాలే అని తెలుస్తోంది.
బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తాను సెంటిమెంట్ గా భావించే పంజాగుట్ట రూమ్ లో త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నట్టు టాక్. అజ్ఞాతవాసి ఫలితం విషయంలో నిందను పూర్తిగా తానే మోయాల్సి వచ్చింది కనక ఈ సారి చిన్న పొరపాటుకు కూడా అవకాశం ఇవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు టాక్. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మంచి లవ్ స్టొరీగా దీన్ని తీర్చిదిద్దుతున్నట్టు తెలిసింది. గతంలో చేసిన బృందావనం తరహాలో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేయబోతున్నాడు యంగ్ టైగర్. రెగ్యులర్ షూటింగ్ కి సంబంధించిన అప్ డేట్ ఇంకా రావాల్సి ఉంది.
వెంకటేష్ తో చేస్తానన్న సినిమా ఎప్పుడు ఉంటుందో మాత్రం నిర్మాత రాధాకృష్ణ కూడా అప్ డేట్ ఇవ్వడం లేదు. తారక్ మూవీ అయ్యాక ఉంటుందా లేక ఈపాటికే కొని పెట్టుకున్న జాలీ ఎలెల్బీ ని వెంకీ తో రీమేక్ చేస్తారా అనే దాని గురించి స్పష్టత లేదు. యద్దనపూడి - మధుబాబు నవలల హక్కులు కొని కథలు రాసుకున్నారు అనే వార్తలో నిజం లేదనే అంటున్నారు త్రివిక్రమ్ సన్నిహితులు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వచ్చాకే త్రివిక్రమ్ అందుబాటులోకి వస్తాడు అంత దాకా వెయిట్ చేయక తప్పదు.