Begin typing your search above and press return to search.

తెలంగాణలో వెతుకుతున్న త్రివిక్రమ్

By:  Tupaki Desk   |   5 July 2018 11:36 AM IST
తెలంగాణలో వెతుకుతున్న త్రివిక్రమ్
X
జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు చాలా ఆశగా ఎదురుచుస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ కూడా అభిమానులను ఎక్కువ రోజులు వెయిట్ చేయించేలా లేడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న అరవింద సమేత సినిమాను చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నాడు. కొన్ని వారాల కిందట స్టార్ట్ చేసిన ఈ సినిమా అప్పుడే సగం షూటింగ్ ని ఫినిష్ చేసుకుంది. షూటింగ్ సంబంధించిన పనులను చాలా స్పీడ్ గా ఫినిష్ చేస్తున్నారు.

ఇక నెక్స్ట్ షెడ్యూల్ కోసం మాటల మాంత్రికుడు ఇటీవల వరంగల్ లో మకాం వేశారట. కథలో కొన్ని కీలకమైన సన్నివేశాలను తెలంగాణ వాతావరణానికి తగ్గట్టు తెరకెక్కించాలను చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంది. అందులో భాగంగానే దర్శకుడు త్రివిక్రమ్ పలు ప్రదేశాలను సందర్శించడం జరిగింది. అలాగే ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని కూడా చూశాడట. ఈ షెడ్యూలో లో యాక్షన్ సీన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత వుంటుందని సమాచారం.

సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి దసరాకి సినిమాను రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారు. ఇక ప్రస్తుతం కొంచెం గ్యాప్ దొరకడంతో తారక్ తన ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతున్నాడు. రీసెంట్ చిన్న కొడుకుకు భార్గవరామ్ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఇక అరవింద సమేత సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్దే నటిస్తుండగా జగపతి బాబు - నాగబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.