Begin typing your search above and press return to search.

నంబ‌ర్ వ‌న్ కెప్టెన్‌ అవ్వాలంటే అర్హ‌త‌?

By:  Tupaki Desk   |   26 April 2020 11:58 AM IST
నంబ‌ర్ వ‌న్ కెప్టెన్‌ అవ్వాలంటే అర్హ‌త‌?
X
సినిమా 24 శాఖ‌ల్లో ద‌ర్శ‌క‌త్వ శాఖ‌కు ఉండే గౌర‌వం వేరు. ద‌ర్శ‌కుడితో పాటు ఆయ‌న అసిస్టెంట్ల‌కు సెట్ లో ఎంతో మ‌ర్యాద ఉంటుంది. ప్రొడ‌క్ష‌న్ తిండి ఇత‌రుల‌కు.. స్టార్ హోట‌ల్ బిరియానీ ద‌ర్శ‌క‌త్వం టీమ్ కి ఏర్పాటు చేస్తారు నిర్మాత‌. అయితే ఏ ద‌ర్శ‌కుడు అయినా సృజ‌కుడు అనిపించుకోవాలంటే .. లేదా ఇండ‌స్ట్రీలో నంబ‌ర్ వ‌న్ అనిపించుకోవాలంటే ఏఏ అర్హ‌త‌లు ఉండాలి? మ‌ంచి బిరియానీ తింటే స‌రిపోతుందా? అంటే.. చాలా సంగ‌తుల్ని లోతుగా ప‌రిశీలించాలి.

తొలిగా ఏ ద‌ర్శ‌కుడు అయినా కాపీ క్యాట్ అన్న ముద్ర వేయించుకోక‌పోతే మెజారిటీ పార్ట్ అత‌డికి ఇండ‌స్ట్రీలో గౌర‌వం ఉంటుంది. ఇక త‌న క‌థ‌ల్ని తానే త‌యారు చేసుకుని విజువ‌లైజ్ చేయ‌గ‌లిగే ద‌ర్శ‌కుడి ప్ర‌త్యేక‌త‌ను ఇండ‌స్ట్రీ వెంట‌నే గుర్తిస్తుంది. ఇక ద‌ర్శ‌కుడి అభిరుచికి మెజారిటీ రెస్పెక్ట్ జ‌నంలో ఆటోమెటిగ్గా పుట్టుకొస్తుంది. బ‌డ్జెట్ లో సినిమా చేయ‌డం.. చెప్పిన టైముకే ప్రొడ‌క్ట్ ని నిర్మాత‌కు అందించేయ‌డం.. న‌వ‌ర‌సాల్ని తెర‌పై ఆవిష్క‌రించి ప్రేక్ష‌కుల్ని కుర్చీ అంచుపూ కూచోబెట్టే నైపుణ్యం ఇవ‌న్నీ ద‌ర్శ‌కుడికి ఉండి తీరాలి.

ఆ కోవ‌లో చూస్తే ఇప్పుడున్న టాప్ డైరెక్ట‌ర్ల‌లో ఇలాంటి అర్హ‌త‌లు కొంచెం అటూ ఇటూగా వంద శాతం ఎవ‌రికి ఉన్నాయి? అంటే ఓ రెండు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ఒక‌రు సుకుమార్ కాగా.. మరొక‌రు కొర‌టాల శివ‌. ఈ ఇద్ద‌రూ ఒరిజిన‌ల్ గా క‌థ‌ల్ని రాసుకోగ‌ల‌రు. ఒరిజినాలిటీతో పెద్ద తెర‌పై ఆవిష్క‌రించ‌గ‌ల‌రు. అలాగే మ‌క్కీకి మ‌క్కీ కాపీలు క‌నిపించ‌వు. అంత‌కుమించి క‌మ‌ర్షియ‌ల్ సక్సెస్ లు అందుకోవ‌డంలోనూ ఈ ఇద్ద‌రినీ కొట్టేవాళ్లు లేరు. సుక్కూకి అడ‌పా ద‌డ‌పా ఫ్లాపులు ఎదురైనా బ్లాక్ బ‌స్ట‌ర్ల జాబితా అత‌డిని స్కైలోనే ఉంచుతుంది. ఇక ఏ ఇత‌ర ద‌ర్శ‌కుడితో పోల్చినా సినిమా సినిమాకి వైవిధ్యం చూపించ‌డంలో ప్ర‌యోగాలు చేయ‌డంలో సుక్కూ త‌ర్వాత‌నే. క‌థ‌ల్ని ఒరిజిన‌ల్ గా వండి వార్చుతాడ‌న్న పేరు అత‌డికి అద‌న‌పు అస్సెట్. ఇక కొర‌టాలను ప‌రిశీలిస్తే పెద్ద‌గా ప్ర‌యోగాల జోలికి వెళ్ల‌కుండానే క‌మ‌ర్షియ‌ల్ హిట్లు కొట్టేస్తున్నాడు. అత‌డిలోని రైట‌ర్ పెద్ద బ‌లం.

అయితే వీళ్ల దారిలో ఎస్.ఎస్.రాజ‌మౌళి-త్రివిక్ర‌మ్- పూరి లాంటి వాళ్లు లేరా? అంటే.. లేరు అనేయ‌లేం. పూరీ ఇటీవ‌ల ఫెయిలైనా అంత‌కుముందు అద్భుత‌మైన క‌మ‌ర్షియ‌ల్ హిట్లు అందించారు. మిగ‌తా ఇద్ద‌రికీ స‌క్సెస్ బోలెడంత ఉంది. ఎంతో గొప్ప ఎంట‌ర్ టైన‌ర్ల‌ను అందించారు. ఇండ‌స్ట్రీ రికార్డులు.. సంచ‌ల‌నాలు న‌మోదు చేశారు. కానీ వీళ్ల‌పై కాపీ క్యాట్ అన్న ఆరోప‌ణ‌లు అంతే బ‌లంగా ఉన్నాయి. అందుకే వీళ్ల‌ను స‌ప‌రేట్ గా చూడాల్సి ఉంటుంద‌ని క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు.