Begin typing your search above and press return to search.

సత్య మూర్తికి సీక్వెలా బన్నీ ?

By:  Tupaki Desk   |   10 April 2019 4:55 PM IST
సత్య మూర్తికి సీక్వెలా బన్నీ ?
X
ఇంకో పన్నెండు రోజుల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా మొదలైపోతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ హారికా హాసిని సంయుక్తంగా నిర్మించే ఈ మూవీ నా పేరు సూర్య వచ్చిన ఏడాది గ్యాప్ తర్వాత షూటింగ్ ప్రారంభించుకొనుంది. ఎంత లేదన్నా విడుదలకు ఆరు నెలలకు పైగా కావాలి కాబట్టి మొత్తం ఏడాదిన్నర బన్నీ సినిమా లేనట్టే.

గతంలో దీని లైన్ తాలుకు ప్రచారం కొంత జరిగింది కాని క్లారిటీ మిస్ కావడంతో అభిమానులు దీని కథ మీద ఎలాంటి అంచనాకు రాలేకపోయారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇది ఫాదర్ సెంటిమెంట్ మీద ఉంటుందట. నేను నాన్న అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్టు గతంలోనే టాక్ నడిచింది. ఇప్పుడు వీటికి బలం చేకూరేలా సన్ అఫ్ సత్యమూర్తి స్టైల్ లో ఎమోషన్స్ ని మాస్ ఎలిమెంట్స్ ని బాలన్స్ చేసే తరహాలో ఈ మూవీ ఉండబోతోందని తెలిసింది

సన్ అఫ్ సత్యమూర్తిలో ప్రకాష్ రాజ్ వేసిన తండ్రి పాత్ర కేవలం కొన్ని సీన్లకే పరిమితం. కాకపోతే కథలో అంతర్లీనంగా దాని జోక్యం ఉంటుంది. ఇప్పుడీ సినిమాలో ఆ రోల్ చేయబోతున్న మలయాళం నటుడు జయరాం ఆసాంతం ఉంటారని తెలిసింది. తనకు జోడిగా మాజీ హీరొయిన్ టబును ఎంపిక చేసుకున్నాడట త్రివిక్రమ్. టబు స్ట్రెయిట్ మూవీ చేసి చాలా కాలం అయ్యింది.

తమన్ ఇప్పటికే మ్యూజిక్ కంపోజింగ్ మొదలు పెట్టేశాడు. అరవింద సమేత వీర రాఘవలో ఫ్యాక్షన్ జానర్ ని టచ్ చేసి మసాలా సినిమా తీసిన త్రివిక్రమ్ ఈసారి మాత్రం పూర్తిగా తన పాత స్కూల్ లో దీన్ని తెరకెక్కించి మరోసారి పెన్ పవర్ చూపించబోతున్నట్టు యూనిట్ వర్గాల టాక్