Begin typing your search above and press return to search.

మహేష్ కోసం త్రివిక్రమ్ స్పెషల్ స్టోరీ.. అదేనా??

By:  Tupaki Desk   |   21 May 2021 4:30 PM GMT
మహేష్ కోసం త్రివిక్రమ్ స్పెషల్ స్టోరీ.. అదేనా??
X
సినిమా ఇండస్ట్రీలో ఏదైనా హీరో = డైరెక్టర్ కాంబినేషన్ రిపీట్ అవుతుందంటే అలాంటి సినిమాలపై అంచనాలు ఓ రేంజిలో నెలకొంటాయి. కానీ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అయితే ఒకలా ఉంటాయి. అదే ప్లాప్స్ పడిన కాంబినేషన్ అయితే అంచనాలు వేరేలా ఉంటాయి. కానీ ఇద్దరూ హీరో - డైరెక్టర్ సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడు సినిమా ఓకే అయితే మాత్రం ఖచ్చితంగా అంచనాలు హై లెవెల్ లోనే ఉంటాయనేది నిజం. ప్రస్తుతం అలాంటి అంచనాలే క్రియేట్ చేసింది సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇదివరకు అతడు - ఖలేజా సినిమాలు వచ్చాయి. టాక్ పరంగా బాగానే ఉన్నప్పటికీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదని చెప్పాలి.

ఆ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ తో పాటు అదిరే యాక్షన్ ఉన్నప్పటికీ సినిమాలను యావరేజ్ లెక్కల్లో పెట్టేసారు ప్రేక్షకులు. ఎంత ఫేవరేట్ హీరో - బడా డైరెక్టర్ అయినప్పటికీ ప్రేక్షకులు కూడా కథలో కంటెంట్ ఉంటేనే సినిమాను తీసుకెళ్లి అందలం ఎక్కిస్తారు. లేదనుకుంటే వారేది చేయాలో అదే చేసి చూపిస్తారు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ పై ఎక్సపెక్టషన్స్ తో పాటు పలు సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా త్రివిక్రమ్ నుండి ఓ ఎక్స్పరిమెంటల్ ఫిల్మ్ చూడాలని ఫ్యాన్స్ అభిప్రాయాలు బయటపెడుతున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్ మహేష్ సినిమా కోసం ఓ చిన్నకథనే గతేడాది లాక్ డౌన్ నుండి రాసుకొచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అది ఎలాంటి కథ అనే విషయం పక్కనపెడితే ఎక్స్పరిమెంటల్ ఫిల్మ్ కావచ్చు అని టాక్ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ సినిమా స్క్రిప్ట్ తో పాటు ప్రీ-ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నట్లు సమాచారం. అలాగే సినిమా కాస్టింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈసారి మహేష్ తో ఎలాంటి సినిమా తెరకేక్కిస్తాడో అని ఫ్యాన్స్ ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం పక్కా అంటున్నారు. ఏంటంటే.. మహేష్ బాబును త్రివిక్రమ్ స్టైలిష్ గా చూపించబోతున్నాడు అని. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాల్లో అందరూ హీరోలు స్మార్ట్ అండ్ స్టైలిష్ లుక్కులో కనిపిస్తారు. అలాంటిది మహేష్ ను ఎలా చూపించగలడో గెస్ చేయగలం అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ మే 31న మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ప్రతి ఏడాది తండ్రి పుట్టినరోజున తన కొత్త సినిమా గురించి ఏదొక అప్డేట్ ఇస్తుంటాడు మహేష్. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ మూవీకి సంబంధించి టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారా లేదా అనేది చూడాలి.