Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్‌ ఆ రెండు సెంటిమెంట్లు రిపీట్‌

By:  Tupaki Desk   |   10 Feb 2022 5:32 AM GMT
త్రివిక్రమ్‌ ఆ రెండు సెంటిమెంట్లు రిపీట్‌
X
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబో మూవీ కోసం తెలుగు ప్రేక్షకులు పుష్కర కాలంగా ఎదురు చూస్తున్నారు. అతడు మరియు ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబో లో సినిమాలు రాలేదు. ఆ రెండు సినిమాలు కూడా బిగ్‌ స్క్రీన్‌ పై అలరించలేదు కాని టీవీలో సెన్షేషనల్‌ సక్సెస్‌ అయ్యాయి. ఇప్పటికి కూడా ఆ సినిమాలను జనాలు తెగ చూసేస్తున్నారు. టీవీ లో ఆ సినిమాలు టెలికాస్ట్‌ అయిన ప్రతి సారి కూడా మంచి రేటింగ్స్ ను దక్కించుకుంటున్న ఆ సినిమాలు మహేష్‌.. త్రివిక్రమ్‌ కాంబో సినిమాల కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పకనే చెబుతున్నాయి. ఎట్టకేలకు వీరి కాంబోలో సినిమా రాబోతుంది. దాదాపుగా ఏడాది క్రితం ప్రకటన వచ్చిన వీరి కాంబో సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. షూటింగ్‌ అతి త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఈ సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్నాయి. సినిమా గురించి రోజుకో వార్త అన్నట్లుగా ప్రచారం జరుగుతూ సినిమా పై అంచనాలు భారీ ఎత్తున పెంచేస్తున్నాయి.

ఆ వార్తల్లో నిజం ఎంతో కాని సినిమా పై అంచనాలు ఆకాశానికి పెంచడం లో మాత్రం ఉపయోగపడుతున్నాయి. తాజాగా మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదేంటి అంటే త్రివిక్రమ్‌ తన గత సినిమాల్లో పాటించిన రెండు సెంటిమెంట్లను ఈ సినిమా లో కూడా కంటిన్యూ చేయబోతున్నాడట.

ఆ రెండు సెంటిమెంట్లలో ఒకటి మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా కు కూడా టైటిల్‌ 'అ' అక్షరంతో మొదలు అయ్యేలా ప్లాన్‌ చేశాడట. ఇప్పటికే రెండు టైటిల్స్ ను అనుకున్న త్రివిక్రమ్‌ ఒక దాన్ని ఫైనల్‌ చేస్తాడని తెలుస్తోంది. మహేష్‌ బాబు కూడా ఆ రెండు టైటిల్స్ పట్ల సంతృప్తిగా నే ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. అఆ.. అజ్ఞాతవాసి.. అరవింద సమేత.. అల వైకుంఠపురంలో ఇలా త్రివిక్రమ్‌ అ జపం చేస్తూ వస్తున్నాడు. కనుక మహేష్ బాబు సినిమాకు కూడా అదే తరహా లో టైటిల్‌ ను పెట్టే అవకాశాలు ఉన్నాయి.. ఆ విషయాన్ని అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. సెంటిమెంట్‌ వర్కౌట్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే ఉద్దేశ్యంతో అభిమానులు కూడా అ టైటిల్‌ పై ఆసక్తిగా ఉన్నారు. మహేష్ బాబు మరియు త్రివిక్రమ్‌ ల కాంబో టైటిల్‌ కోసం ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఇక త్రివిక్రమ్‌ రెండవ సెంటిమెంట్‌ విషయానికి వస్తే ఆయన తన గత చిత్రాల్లో చూస్తే సీనియర్‌ హీరోయిన్స్ ను తీసుకు వచ్చాడు. ఇప్పటికే ఆయన పలువురు సీనియర్ హీరోయిన్స్ ను తన సినిమాలో నటింపజేయడం ద్వారా వారికి మంచి పాపులారిటీని తీసుకు రావడం మాత్రమే కాకుండా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసి ఆకట్టుకున్నాడు.

మహేష్‌ బాబు మరియు త్రివిక్రమ్‌ ల కాంబో మూవీ లో కూడా ఒక సీనియర్ హీరోయిన్‌ ను నటింపజేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆమె తెలుగు లో ఎన్నో సినిమాల్లో నటించి సీనియర్ హీరోలు అయిన చిరంజీవి ఇంకా పలువురు స్టార్స్ కు సరి జోడీగా నిలిచింది. ముఖ్యంగా చిరంజీవితో ఆమె ది సూపర్‌ హిట్ కాంబినేషన్‌. అందుకే ఇప్పటికి కూడా ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలుగానే ఉన్నారు,

ఆమె మరెవ్వరో కాదు సీనియర్ హీరోయిన్‌ రాధ. ఆమె ఇద్దరు కూతుర్లు కూడా హీరోయిన్స్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. పెద్దమ్మాయి కార్తీక తెలుగు లో కూడా సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన విసయం తెల్సిందే.

ఇద్దరు హీరోయిన్స్ కూడా స్టార్‌ హీరోయిన్స్ గా గుర్తింపు దక్కించుకోవడం లో విఫలం అయ్యారు. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్ గా నిలిచిన రాధ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటారు. కాని మళ్లీ ఆమె నటించాలనే ఆసక్తిగా ఉన్నారట. సినిమాల్లో ఎంట్రీ కోసం ఆమె ఈమద్య కాలంలో కాస్త బరువు కూడా తగ్గారనే వార్తలు వస్తున్నాయి. ఆమెను మహేష్ బాబు కు తల్లి పాత్రలో నటింపజేయడం ద్వారా తెలుగు ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు త్రివిక్రమ్‌ ఉన్నాడని తెలుస్తోంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు. త్రివిక్రమ్‌ తో చేయబోతున్న సినిమా తర్వాత మహేష్ బాబు భారీ చిత్రం ను రాజమౌళి దర్శకత్వంలో చేయాల్సి ఉంది.